పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన రైలు ప్రమాదాన్ని 12 ఏళ్ల బాలుడు తన తెలివితో తప్పించాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలోని రైల్వే యార్డు సమీపంలో గత గురువారం ఈ ఘటన జరిగింది. రైలు పట్టాల సమీపంలోకి వస్తుండగా ఒకచోట రైలు పట్టాలు విరిగిపోయి ఉండటాన్ని బాలుడు చూశాడు. ఈ సమయంలో వచ్చే రైలును అప్రమత్తం చేసే అవకాశం లేదు. ఈ విషయం తెలుసుకున్న బాలుడు తను ధరించిన ఎరుపు రంగు టీషర్టును తీసి జెండాలా ఊపుతూ లోకో పైలట్‌ను హెచ్చరించాడు. దీంతో ఆ చిన్నారి రైలు ప్రమాదాన్ని తప్పించాడు. ముర్సలీన్ షేక్ అనే బాలుడు పొలాల్లో పని చేసే వలస కూలీ కొడుకు. ఘటన జరిగిన సమయంలో ముసలీన్ కొందరు కూలీలతో కలిసి పొలంలో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో యార్డు సమీపంలోని రైల్వే ట్రాక్‌లో కొంత భాగం దెబ్బతిని ఉండటం గమనించాడు.. అదే ట్రాక్‌పై ఓ ప్యాసింజర్ రైలు వేగంగా వస్తుండటం చూశాడు… వెంటనే ఆ కుర్రాడు తన ఎర్రటి టీ షర్టు తీసి ఎదురుగా వస్తున్న రైలుకి అడ్డంగా ఊపడం మొదలుపెట్టాడు.
ఈ సంఘటన గురించి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ,..12 ఏళ్ల చిన్నారి మాల్దా వద్ద రైలుకు అడ్డంగా తన ఎర్ర చొక్కాను ఊపి పెను ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. బాలుడు ఎర్ర చొక్కను చూసించటంతో.. లోకో పైలట్ ప్యాసింజర్ రైలును ఆపడానికి అత్యవసర బ్రేకులు వేశాడు. భారీ వర్షం కారణంగా రైలు ట్రాక్ దెబ్బతింది. ఆ చిన్నారి దీన్ని గమనించి ఇలా చేశాడు. వర్షానికి దెబ్బతిన్న విభాగాన్ని చూసిన బాలుడు వెంటనే.. సరైన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించినందుకు అధికారులు బాలుడిని ప్రశంసించారు.
రైల్వే అధికారులు బాలుడిని గ్యాలంట్రీ సర్టిఫికేట్‌తో సత్కరించారు. నగదు బహుమతిని కూడా అందించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజనల్ రైలు మేనేజర్లు బాలుడి ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. మరోవైపు దెబ్బతిన్న ట్రాక్‌ల భాగానికి మరమ్మతులు చేసి పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, దేశ వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. జూన్ 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..