Rahul Gandhi: ఫుల్‌ జోష్‌తో భారత్ జోడో యాత్ర.. మీసం మెలేసిన రాహుల్ గాంధీ.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ పిక్..

|

Nov 26, 2022 | 1:15 PM

ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఈ యాత్రలో రాహుల్‌ మీసం తిప్పడం ఇప్పుడు వైరల్‌గా..

Rahul Gandhi: ఫుల్‌ జోష్‌తో భారత్ జోడో యాత్ర.. మీసం మెలేసిన రాహుల్ గాంధీ.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ పిక్..
Rahul Gandhi
Follow us on

ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఈ యాత్రలో రాహుల్‌ మీసం తిప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది. అవును, రాహుల్‌గాంధీ జోడోయాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. క్యాడర్‌ నుంచి పెద్ద నాయకుల దాక అందరిలో ఉషారు కనిపిస్తోంది. ఏ రాష్ట్రంలో యాత్ర చేసిన అక్కడి పరిస్థితులను బట్టి ప్రసంగాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే అక్కడి పార్టీల మీద పవర్‌ ఫుల్‌ పంచులతో విరుచుకుపడుతున్నారు. అక్కడి సంసృతులు, సాంప్రదాయాలు తెలుసుకొని మరి కలిసిపోతున్నారు. తాజాగా ఆయన బాక్సర్‌ విజయేందర్‌ సింగ్‌తో కలిసి మీసాలు మెలితిప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాహుల్ మీసం తిప్పుతున్న ఫోటోను చూసి కాంగ్రెస్ శ్రేణులు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. రాహుల్ గాంధీ గడ్డం, మీసాలు పెంచడంతో ఇరాక్‌ మాజీ నియంత సద్దాం హుస్సేన్‌ లా ఉన్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విమర్శలను పట్టించుకోకపోవడమే కాకుండా రాహుల్ మీసాలు మెలితిప్పారు. ఈ ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. ఇక యాత్రలో మధ్యప్రదేశ్ రైతులు, కార్మికులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు రాహుల్ ను కలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక గత సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తి చేసుకుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించింది. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్​లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్రతో రాష్ట్ర కాంగ్రెస్​ నేతల్లో కొత్త ఉషారు కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..