బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబులతో దాడి.. కాల్పులు

| Edited By:

Jul 25, 2019 | 4:23 PM

వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ ఎంపీ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబులతో దాడి చేశారు. అనంతరం కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాష్ట్రంలోని నార్త్ పరగణాస్ జిల్లాలోని బరాక్ పోరి పట్టణంలోని బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్ ఇంటి వద్ద ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి అగంతకులు ఈ దాడికి పాల్పుడ్డారు. ఈ ఘటనపై ఎంపీ ఫిర్యాదు చేయడంతో.. వెస్ట్ బెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు […]

బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబులతో దాడి.. కాల్పులు
Follow us on

వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ ఎంపీ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబులతో దాడి చేశారు. అనంతరం కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాష్ట్రంలోని నార్త్ పరగణాస్ జిల్లాలోని బరాక్ పోరి పట్టణంలోని బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్ ఇంటి వద్ద ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి అగంతకులు ఈ దాడికి పాల్పుడ్డారు. ఈ ఘటనపై ఎంపీ ఫిర్యాదు చేయడంతో.. వెస్ట్ బెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడ్డవారు ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి.. రాష్ట్రంలో అధికార పార్టీ టీఎంసీ, బీజేపీల మధ్య నిత్యం ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.