BJP: 2024 ఎన్నికలే టార్గెట్.. పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ.. ఆ ఇద్దరు సీనియర్లు ఔట్..

| Edited By: Ravi Kiran

Aug 17, 2022 | 3:43 PM

11 మందితో పార్లమెంటరీ కొత్త బోర్డు, మరో 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మంది నేతలకు స్థానం కల్పించగా.. ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు.

BJP: 2024 ఎన్నికలే టార్గెట్.. పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ.. ఆ ఇద్దరు సీనియర్లు ఔట్..
Bjp
Follow us on

BJP Parliamentary Board – CEC: భారతీయ జనతా పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డులో ప్రక్షాళన చేసింది. దీంతోపాటు ఎన్నికల కమిటీని బుధవారం ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ కొత్త బోర్డు, మరో 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మంది నేతలకు స్థానం కల్పించగా.. ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్‌ కే లక్షణ్‌కు అవకాశం దక్కింది.

కొత్త పార్లమెంటరీ బోర్డు.. ఇదే

ఇవి కూడా చదవండి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ బోర్డులో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్‌ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్‌, ఇక్బాల్ సింగ్ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జతియా , కేఎల్‌ సంతోష్‌ సభ్యులుగా ఉంటారు. జేపీ నడ్డా అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా డాక్టర్‌ లక్ష్మణ్‌కు చోటు దక్కింది. ఈ కమిటీలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ , కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌కు కూడా అవకాశం కల్పించారు. నడ్డా ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ..

జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్‌ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్‌, ఇక్బాల్ సింగ్ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జటియా , కేఎల్‌ సంతోష్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ , కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌, ఓమ్ మథుర్‌, వనతి శ్రీనివాస్‌కు చోటు కల్పించారు.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..