రామ్ టెంపుల్ ఆలయ పోస్టర్ తొలగించిన పోలీసులు, వైరల్ అయిన వీడియో, ముంబైలో బీజేపీ నేతల నిరసనలు

రామాలయ పోస్టర్ ను పోలీసులు తొలగిస్తున్న వీడియో వైరల్ కావడంతో ముంబైలో అలజడి రేగింది. మాల్వానీ పోలీసు స్టేషన్ ఎదుట బీజేపీ నేతలు

  • Umakanth Rao
  • Publish Date - 2:30 pm, Sun, 24 January 21
రామ్ టెంపుల్ ఆలయ పోస్టర్ తొలగించిన పోలీసులు, వైరల్ అయిన వీడియో, ముంబైలో బీజేపీ నేతల నిరసనలు

రామాలయ పోస్టర్ ను పోలీసులు తొలగిస్తున్న వీడియో వైరల్ కావడంతో ముంబైలో అలజడి రేగింది. మాల్వానీ పోలీసు స్టేషన్ ఎదుట బీజేపీ నేతలు నిరసనకు దిగారు. అయోధ్యలో నిర్మించే రామాలయ నిర్మాణానికి నిధులను, విరాళాలను సేకరించేందుకు ఓ సంస్థ నగరంలో ఈ పోలీస్ స్టేషన్ వద్ద ఓ పోస్టర్ ను అతికించింది. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆదేశాలపై పోలీసులు ఈ పోస్టర్ ను తొలగించారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు కొందరు దీన్ని వీడియో తీసి స్థానిక నేతల దృష్టికి తేవడంతో రచ్ఛ మొదలైంది. బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి,ప్రతిపక్ష నేత ప్రవీణ్ తదితరులు ఈ పోలీసు స్టేషన్ వద్దకు వఛ్చి నిరసనకు దిగారు. ఇందుకు కారకులైన ఖాకీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాండవ్ వెబ్ సిరీస్ వివాదంతో ముఖ్యంగా ముంబైలో కమలం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.