మోడీ పాలనకు ఎనిమిదేళ్లు మిగిసాయి. అయితే ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ వివరాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజకీయ సంస్కృతిని మార్చేశారని.. ప్రతిస్పందించే, ప్రజానుకూల ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని జేపీ నడ్డా వెల్లడించారు. గత ప్రభుత్వాలకు తమ ప్రభుత్వ పని తీరులో కూడా మార్పు వచ్చిందన్నారు నడ్డా. మోదీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన
ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే మోదీ ప్రభుత్వానికి ఆత్మ అంటూ అభివర్ణించారు. తమ ప్రభుత్వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్‌లతో కలిసి ఓ థీమ్‌సాంగ్‌ను ఆయన విడుదల చేశారు. దీన్ని ఆధునిక భారతదేశ సృష్టికర్తగా పేర్కొన్నారు. “నమో యాప్” ద్వారా యువత, పౌరులను చేరేందుకు ‘ఎనిమిదేళ్ల సేవా, సుశాసన్, గరీబీ కళ్యాణ్’ అనే ప్రత్యేక క్యాంపెయిన్‌ను కూడా నడ్డా ఈ సందర్భంగా ప్రారంభించారు. నమో యాప్‌లో ఈ ప్రత్యేక వేదిక చాలా ఇంటరాక్టివ్, ఇన్ఫర్మేషన్ ఫీచర్లతో ఉంటుందన్నారు. ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించిన వీడియోలు, గ్రాఫిక్‌లు, వ్యాసాలు ఉంటాయని తెలిపారు.
2014 తర్వాత దేశంలో..
2014 తర్వాత దేశంలో ప్రస్తుతం ప్రతిస్పందించే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో ప్రణాళికలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాని.. కానీ ఇవాళ ఏదైనా ఒక పథకం ప్రకటించినప్పటి నుంచి అమలు దాకా ప్రతిదీ నిరంతరం మానటిరింగ్ జరుగుతోందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో 6.37 లక్షల ప్రాథమిక పాఠశాలలను విద్యాశాఖ ద్వారా నిర్మిస్తే.. గత ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ 6.53లక్షల ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసింది.
Through a cryptic, carefully worded comment by its president JP Nadda, BJP indicated that it is not taking a direct plunge into the ongoing tussle over reclaiming the #Gyanvapi mosque in Varanasi and the Krishna Janmabhoomi in Mathura. (By @Rahulshrivstv)https://t.co/sPBA0WukBq
— IndiaToday (@IndiaToday) May 31, 2022
యూనివర్సిల్ ఎడ్యుకేషన్..
యూనివర్సిల్ ఎడ్యుకేషన్ అనే దృష్టితో ముందుకెళ్తున్నమని వివరించారు. “గరీబ్ కళ్యాణ్” అన్న యోజన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని అన్నారు. “కిసాన్ సమ్మాన్ నిధి” కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒక్కో రైతులకు 10 ఇన్‌స్టాల్‌మెంట్లలో రూ.2వేలు చొప్పున మొత్తంగా రూ.లక్షా 80వేల కోట్లు అందించామని వెల్లడించారు. 11వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద నిధులను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ షిమ్లా నుంచి విడుదల చేస్తారని తెలిపారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.