గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ భారీ కసరత్తు.. జాతీయ స్థాయి నేతలకు బాధ్యతలు.. స్థానిక నేతలతో మేనేజ్‌మెంట్ కమిటీ

బీజేపీ అధినాయకత్వం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. అందుకు ఆదివారం తీసుకున్ననిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆదివారం బీజేపీ జాతీయ నాయకత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ మేరకు నియామకాలు చేసింది.

గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ భారీ కసరత్తు.. జాతీయ స్థాయి నేతలకు బాధ్యతలు.. స్థానిక నేతలతో మేనేజ్‌మెంట్ కమిటీ
Rajesh Sharma

|

Nov 15, 2020 | 6:02 PM

BJP big exercise on GHMC elections: దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన బీజేపీ.. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. గ్రేటర్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల పరిధిలోని వచ్చినా.. వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. సత్తా చాటాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తాజాగా తీసుకున్న నిర్ణయాలతో తెలుస్తోంది. అందుకు గ్రేటర్ పరిధిలో 20కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలుండడమే కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ జాతీయస్థాయిలో సంసిద్ధమవుతున్నట్లు ఆదివారం ప్రకటించిన రెండు కమిటీల ద్వారా వెల్లడించింది బీజేపీ అధినాయకత్వం. జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌కు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి కో-కన్వీనర్‌గా కర్నాటక విద్యా మంత్రి డా.సుధాకర్, మహా రాష్ట్రకు చెందిన అశీష్ షెల్లార్, గుజరాత్‌కు చెందిన ప్రదీప్ సింగ్ వాఘేలా, కర్నాటక బీజేపీ కార్యదర్శి, ఎమ్మెల్యే సతీష్ రెడ్డిలను సభ్యులుగాను నియమించింది బీజేపీ నాయకత్వం.

అదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం మేనేజ్‌మెంట్ కమిటీ వేసిన బీజేపీ అధినాయకత్వం దానికి ఛైర్మెన్‌గా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డిని, కన్వీనర్‌గా బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ ఛైర్మెన్ డా. కే.లక్ష్మణ్‌ను, కో కన్వినర్‌గా మాజీ ఎంపీ జీ.వివేక్‌పే, ఎన్నికల ఇంఛార్జీలుగా గరికపాటి నరసింహారావు, చింతల రామచంద్రారెడ్డిలను నియమించారు.

ALSO READ: టమోటాల లారీలో పేలుడు పదార్థాల స్మగ్లింగ్

ALSO READ: కెనడాలో తెలుగు యువకుని ఆత్మహత్య

ALSO READ: ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్

ALSO READ: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ముహూర్తం ఖరారు

ALSO READ: వైసీపీలో వర్గపోరు.. టెంపుల్ కోసం తన్నులాట

ALSO READ: ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి

ALSO READ: పెద్దపులి భయంతో జంతు బలి బంద్..

ALSO READ: కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu