‘అప్పు రేపు’.. బోర్డు ఎందుకు పెడతారో ఇప్పుడర్థమైంది.. కోడిగుడ్లు అరువు ఇవ్వలేదని..

|

Apr 23, 2023 | 11:12 AM

ఏదైనా షాపునకు వెళితే.. అప్పు రేపు.. అని బోర్డు చూస్తాం.. ఇది మాత్రం కామన్.. ఎందుకంటే షాపు యజమాని అప్పు ఇవ్వొద్దని నిర్ణయించుకోని.. అరువు అడక్కండి అని బోర్డు పెడతాడు.. అప్పుడు ఇచ్చి చేడు కావడం ఇష్టం లేని వారు ఈ తరహా సూత్రం పాటిస్తారు..

‘అప్పు రేపు’.. బోర్డు ఎందుకు పెడతారో ఇప్పుడర్థమైంది.. కోడిగుడ్లు అరువు ఇవ్వలేదని..
Eggs
Follow us on

ఏదైనా షాపునకు వెళితే.. అప్పు రేపు.. అని బోర్డు చూస్తాం.. ఇది మాత్రం కామన్.. ఎందుకంటే షాపు యజమాని అప్పు ఇవ్వొద్దని నిర్ణయించుకోని.. అరువు అడక్కండి అని బోర్డు పెడతాడు.. అప్పుడు ఇచ్చి చేడు కావడం ఇష్టం లేని వారు ఈ తరహా సూత్రం పాటిస్తారు.. అయితే, ఇలా ఎందుకు పెడతారో అందరికీ తెలిసిందే. అదే.. అప్పు.. తాజాగా.. ఓ బిర్యానీ సెంటర్ యజమాని కోడిగుడ్లు అప్పుగా ఇవ్వలేదని.. కొందరు దారుణానికి పాల్పడ్డారు. ఆ షాపు యజమానిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. ఇప్పుడి షాకింగ్ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడిగుడ్లు అప్పుగా ఇవ్వలేదని ఓ బిర్యానీ సెంటర్‌ యజమాని కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

బిలాస్‌పుర్‌ జిల్లా బర్తోరి గ్రామానికి చెందిన యోగేశ్‌ వర్మ అనే వ్యక్తి బిర్యానీ సెంటర్‌ నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అయితే, ఏప్రిల్‌ 20న యోగేష్ దుకాణానికి కొహ్రాడా గ్రామానికి చెందిన దీపక్‌ చతుర్వేది, రాహుల్‌ కుమార్‌ భాస్కర్‌, పరమేశ్వర్‌ భరద్వాజ్‌ వెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం ముగ్గరు యోగేష్ తో మాట్లాడి.. కోడిగుడ్లు అప్పుగా ఇవ్వాలని అడిగారు.

Crime News

వారి మాటలు విన్న యోగేశ్ అప్పు ఇవ్వడం కుదరదంటూ ఖరాకండిగా చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన ముగ్గురు నిందితులు.. చిర్రుబుర్రులాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం.. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు అతడ్ని కిడ్నాప్‌ చేశారు. కారులో ఎక్కించుకుని ముక్తిధామ్‌ అనే ప్రాంతానికి తీసుకెళ్లి.. యోగేశ్‌ను దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..