ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై యుద్దాన్ని తీవ్రం చేశారు సీఎం కేజ్రీవాల్. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీలో కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు బీహార్ సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్‌కు సంపూర్ణమద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు.
ఢిల్లీలో పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు కేజ్రీవాల్. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 8 రోజులకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎల్‌జీకి అధికారం కట్టబెట్టిందని మండిపడ్డారు. దీనిపై మరోసారి న్యాయపోరాటం చేస్తామన్నారు.
కాగా, కేంద్రం తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు బీహార్ సీఎం నితీష్‌కుమార్. సుప్రీంకోర్టు తీర్చు వచ్చాక కూడా రాష్ట్రాల అధికారం లాక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక కూడా రాష్ట్రం అధికారాలను లాక్కోవడం చాలా ఆశ్చర్యం కలిగింది. ఇది ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకం. మా మద్దతు కేజ్రీవాల్‌కు ఉంటుంది. ఆయనకు మద్దతుగా వివిధ రాజకీయ పక్షాలను ఏకం చేస్తాం’ అని పేర్కొన్నారు నితిష్.
సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారు కేజ్రీవాల్. ముంబై వెళ్లి ఉద్దవ్ ఠాక్రే , శరద్‌పవార్‌తో ఆయన భేటీ కానున్నారు. చెన్నైలో స్టాలిన్‌తో కూడా సమావేశమవుతారు. తరువాత బెంగాల్ సీఎం మమతతో భేటీ అవుతారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..