బీహార్‌లో బోరుబావులు పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నలందా జిల్లా కులు గ్రామంలో బోరుబావిలో బాలుడు పడిపోయాడు. బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నాలుగేళ్ల శుభంకుమార్‌ను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పొలం దగ్గర ఆడుకుంటూ శుభం బోరుబావిలో పడిపోయాడు.
బోరుబావిలో పడ్డ బాలుడు సజీవంగా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. బాలుడిని కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. బోరుబావి లోకి కెమెరాను పంపించారు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది. ఆక్సిజన్ కూడా నిరంతరం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. బోరుబావిలో బాలుడి కదలికలు స్పష్టంగా కనబడుతున్నాయి. మైక్‌తో బాలుడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 40 అడుగుల లోతున్న బోరుబావిలో శుభం పడిపోవడంతో పేరంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
పొలానికి నీటి కోసం అక్కడ బోర్ వేయించే ప్రయత్నం చేశాడు ఓ రైతు . కానీ వాటర్ పడలేదు. దీంతో వారు మరొక ప్రదేశంలో బోర్ వేశారు. కానీ పాత బోర్ మూసివేయకపోవడంతో ఈ ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలపై పదే, పదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. పలువురిలో మార్పు రాకపోవడం గమనార్హం.
#WATCH | Bihar: A child fell into a borewell in Kul village of Nalanda. A rescue operation is underway. pic.twitter.com/yWpgYlpV4E
— ANI (@ANI) July 23, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..