కొత్తపార్లమెంట్ సాక్షిగా నవశకం.. సమానత్వం వైపు అడుగులేసిన చారిత్రక సందర్భం..

| Edited By: Venkata Chari

Sep 19, 2023 | 7:10 PM

దాదాపు మూడు దశాబ్దాలుగా కోల్డ్‌ స్టోరేజిలో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎట్టకేలకు మోక్షం లభించబోతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా.. ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చింది.

కొత్తపార్లమెంట్ సాక్షిగా నవశకం.. సమానత్వం వైపు అడుగులేసిన చారిత్రక సందర్భం..
Whatsapp Image 2023 09 19 At 7.01.06 Pm
Follow us on

దాదాపు మూడు దశాబ్దాలుగా కోల్డ్‌ స్టోరేజిలో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎట్టకేలకు మోక్షం లభించబోతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలపగా.. ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చింది. ఆర్టికల్‌ 128 సవరణ ద్వారా చట్టసభల్లో స్త్రీశక్తికి సరైన గౌరవం దక్కనుంది. బిల్లు పంపడానికి దేవుడే తనను పంపాడని ప్రధాని అంటే.. ఇది తమ మానసపుత్రిక అంటోంది కాంగ్రెస్‌ పార్టీ. అటు బీఆర్ఎస్ పోరాటఫలితమేనంటున్నారు తెలంగాణ మంత్రులు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లు నారీశక్తి వందన్‌ పేరుతో పార్లమెంట్‌ ముందుకొచ్చింది..

లోక్‌సభలో బిల్లు నెగ్గడం లాంఛనమే.. రేపు చర్చ అనంతరం బిల్లును ఎంపీలు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముప్పై ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఈ బిల్లుకు విపక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌లో జరిగిన తొలి ప్రసంగంలో కోరారు. 21న రాజ్యసభలో దీనిపై చర్చిస్తారు. ఇది తమ పార్టీ చిరకాల ఆకాంక్ష అని 2010లోనే బిల్లు తీసుకొచ్చామంటోంది కాంగ్రెస్‌. ఈ క్రెడిట్‌ ఇవ్వడం ప్రధాని మోదీకి ఇష్టం లేదంటూ ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్‌ పక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే.

ఇవి కూడా చదవండి

మరోవైపు తెలంగాణలోనూ మహిళా బిల్లుపై క్రెడిట్‌ వార్‌ నడుస్తోంది. తమ పోరాట ఫలితంగానే కేంద్రం దిగొచ్చిందని బీఆర్ఎస్‌ అంటే.. కవిత ఓ లెటర్‌ రాయగానే మోదీ ప్రభుత్వం దిగొచ్చి మహిళా బిల్లు పెట్టారా అంటూ ప్రశ్నించింది బీజేపీ. కేసీఆర్‌ ఎంతమంది మహిళలకు సీట్లు ప్రకటించారని ప్రశ్నించారు డీకే అరుణ. అటు తమ పార్టీ వల్లే బిల్లు సాకారం అవుతుందని.. ఈ ఘనత తమదేనంటూ ప్రకటించారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. ఎవరి క్రెడిట్‌ ఎంత ఉన్నా బిల్లు పాసైతే పార్లమెంట్‌, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు లభించనున్నాయి. ఇది జరిగితే దేశ గౌరవం మరింత పెరుగుతుంది. దేశ రాజకీయాలను మార్చివేస్తుంది. ఇది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల సాకారవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..