Punjab CM Amareender Singh: చనిపోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు… రూ.5లక్షల పరిహారం..
రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం...
రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. రైతు ఉద్యమంలో ఇప్పటివరకు దాదాపు 76 మంది చనిపోయారు. తన ఫేస్‌బుక్ లైవ్ ప్రోగ్రాం ‘ఆస్క్ ది కెప్టెన్’లో ఈమేరకు కెప్టెన్ ఈ ప్రకటన చేశారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీ శివారులో నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు.
మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకిగా ఉన్నాయంటూ పేర్కొంటున్న రైతులు వాటిని రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ చట్టాలను రూపొందించారని, వీటిని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రైతు ఉద్యమంలో పాల్గొన్న పలువురు ఈ చట్టాలతో నష్టపోవాల్సి వస్తుందని ఆత్మహత్య చేసుకున్నారు.