Budget 2021: కోవిడ్ పై కొత్తగా సెస్, ప్రభుత్వ యోచన, అదనపు నిధుల సేకరణే లక్ష్యం, ప్రతిపాదనల్లో చేర్చే అవకాశం
నూతన బడ్జెట్ లో ప్రభుత్వం కోవిడ్ (కరోనా వైరస్) పై కొత్తగా సెస్ విధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అదనపు నిధుల సేకరణే
నూతన బడ్జెట్ లో ప్రభుత్వం కోవిడ్ (కరోనా వైరస్) పై కొత్తగా సెస్ విధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అదనపు నిధుల సేకరణే లక్ష్యంగా ఇందుకు పూనుకోవచ్చునని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడుతోంది. 2021-22 బడ్జెట్ లో గ్లోబల్ స్టాండర్డ్స్ ను అందుకోవాలంటే మరిన్ని టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడంతో బాటు ఇతర అవసరాలకోసం కేంద్రం కొత్తగా ఫండ్ ను నియమించాలని ఈ సంస్థ కోరుతోంది. గ్లోబల్ గా మార్కెటింగ్ అవకాశాలను పెంచుకోవాలని, ఇందుకు రాయితీతో కూడిన క్రెడిట్ స్కీమ్ ని ప్రకటించాలని సూచించింది. అలాగే మరో ప్రోత్సాహకంగా ఫుడ్ సేల్స్ పై ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ ని ఇవ్వాలని కూడా కోరింది. కరోనా వైరస్ సెస్ లేదా సర్ ఛార్జిని ప్రతిపాదనకు ప్రాధాన్యం పెరుగుతోందని, అదనపు రెవెన్యూను సమీకరించడానికి అదనపు పన్ను కూడా అవసరమని సంబంధిత వర్గాలు అంటున్నాయి. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ నుంచి 26,192,31 కోట్లను కేటాయించింది.
పెట్రోలు, డీసెల్ పై లీటరుకు రూపాయి చొప్పున సెస్ విధించాలన్న యోచన కూడా ఉంది. అయితే ఈ రెండు ఉత్పతులపైనా ప్రస్తుతమున్న రిటైల్ ధరలను కూడా సర్కార్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి ,మరి ! 10 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నపన్ను చెల్లింపుదారులపై ఈ సెస్ విధించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్ల 15 వేల కోట్ల నుంచి 18 వేల కోట్ల అదనపు ఆదాయం పొందవచ్చునని భావిస్తున్నారు. అలాగే అయిదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ లో రెండు లక్షల 50 వేల కోట్ల పెట్టుబడుల కోసం కోవిడ్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఇండియన్ రెవెన్యూ సర్వీసు ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించవలసి ఉంటుంది.