కాంగ్రెస్‌కు బిగ్ షాక్: రాజ్యసభ చీఫ్ విప్ రాజీనామా!
కీలకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లులపై చర్చ జరుగుతోన్న వేళ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. కీలకమైన బిల్లుల ఓటింగ్ విషయంలో పార్టీ చీఫ్ విప్ రాజీనామా చేయడం ఆ […]
కీలకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లులపై చర్చ జరుగుతోన్న వేళ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. కీలకమైన బిల్లుల ఓటింగ్ విషయంలో పార్టీ చీఫ్ విప్ రాజీనామా చేయడం ఆ పార్టీకి సంకట పరిణామమే. త్వరలో భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తానని ఆయన తెలిపారు. అసోం నుంచి కలిత రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. 2020 ఏప్రిల్ 9తో ఆయన పదవీ కాలం ముగియనుంది.
I have resigned from the Rajya Sabha membership today. #Assam
— Bhubaneswar Kalita (@BKalitaAssam) August 5, 2019