Vande Bharat Train: వంద స్పీడ్‌తో దూసుకెళ్తున్న వందేభారత్‌.. అడ్డొచ్చిన ఆవు.. కట్ చేస్తే ఆగమాగం…

| Edited By: Janardhan Veluru

Apr 28, 2023 | 4:48 PM

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన వందే భారత్ రైలు విజయవంతంగా పరుగులు పెడుతోంది. కానీ, అక్కడక్కడా మాత్రం అవాంఛనీయ ఘటనలు తప్పడం లేదు. అత్యంత వేగంగా ప్రయాణించే వందేభారత్‌తో పలుచోట్ల ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో ప్రమాదం జరిగింది. వంద స్పీడ్ తో వెళ్తున్న రైలు ఆవును ఢీకొట్టింది.

Vande Bharat Train: వంద స్పీడ్‌తో దూసుకెళ్తున్న వందేభారత్‌.. అడ్డొచ్చిన ఆవు.. కట్ చేస్తే ఆగమాగం...
Follow us on

దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన వందే భారత్‌ రైలు ఎంతో మంది ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన వందే భారత్ రైలు విజయవంతంగా పరుగులు పెడుతోంది. కానీ, అక్కడక్కడా మాత్రం అవాంఛనీయ ఘటనలు తప్పడం లేదు. అత్యంత వేగంగా ప్రయాణించే వందేభారత్‌తో పలుచోట్ల ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో ప్రమాదం జరిగింది. వంద స్పీడ్ తో వెళ్తున్న రైలు ఆవును ఢీకొట్టింది. దీంతో రైళు ముందుగా ధ్వంసమైంది.  ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొత్తగా ప్రారంభించిన హజ్రత్ నిజాముద్దీన్-రాణి కమలాపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ స్టేషన్ సమీపంలో ఆవును ఢీకొట్టింది. దీంతో రైలు ముందు భాగం దెబ్బతిన్నట్లు రైల్వే అధికారి తెలిపారు. రాణి కమలాపతి వెళ్లే రైలు (నం 20172) సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో ఆవును ఢీకొట్టింది. సుమారు 15 నిమిషాల పాటు అక్కడికక్కడే ఆగిపోయింది. దెబ్బతిన్న రైలు ముందు భాగాన్ని అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాత రైలు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

హజ్రత్ నిజాముద్దీన్-రాణి కమలాపతి సెమీ హైస్పీడ్ రైలును ఏప్రిల్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఫ్లాగ్‌ఆఫ్ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రైల్వే రంగాన్ని మార్చడం, పౌరులకు ప్రయాణ సౌకర్యం కల్పించడమే తమ ప్రయత్నం అన్నారు. దేశంలోని 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 7.45 గంటల్లో 708 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వందే భారత్ భారతదేశంలోని కొత్త పరిణామాలకు ప్రతీక అని, దేశంలోని ప్రతి మూలలో దీనికి డిమాండ్ ఉందని ప్రధాని అన్నారు.