AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర.. కఠినమైన ఆంక్షలకు సిద్ధంగా ఉండాలన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే

Lockdown: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా,..

మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర.. కఠినమైన ఆంక్షలకు సిద్ధంగా ఉండాలన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే
AP Corona virus
Subhash Goud
|

Updated on: Mar 29, 2021 | 7:21 AM

Share

Lockdown: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా, తాజాగా మళ్లీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. ఇక మహారాష్ట్రలో అయితే పాజిటివ్‌ కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రజలు కోవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలని, ప్రజల నిర్లక్ష్యం కారణంగా మహారాష్ట్రలో కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయిన ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. ఇప్పటికైనా ప్రజలు నిర్లక్ష్యం వీడకపోతే ప్రమాదం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు.

అయితే కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం సంకేతాలిచ్చారు. కోవిడ్‌ నిబంధనలు పాటించపోతే ప్రజలు మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉండాలంటూ సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో ఆదివారం సమావేశమైన ముఖ్యమంత్రి.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా కట్టడికి మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే మంచిదని అధికారులు ఉద్ధవ్‌కు సూచించగా, మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజలు నిత్యావసరాలు, మందుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆస్పత్రులలో సౌకర్యాలపై ఆరా తీశారు. దేశంలో రోజూ నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 60 శాతంకుపైగా మహారాష్ట్రలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కేసులను బట్టి మళ్లీ లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి వస్తుందేమోనన్న అనుమానాలు కలగకమానదు. ముంబైలో ఒక్క రోజే 6,923 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది.

హోళీ పండగ సందర్భంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. రాష్ట్రంలో నిత్యం రికార్డు స్థాయిలో వెలుగులోకి వస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 40,414 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 108 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలో 6,923 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,13,875 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 54,181 కి చేరింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 17,874 మంది రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,33,2453 కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 3,25,901 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది.

ఇవీ చదవండి: Delhi Coronavirus: దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Corona: తెలంగాణలో మాస్క్ మస్ట్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. సర్కార్ కీలక ఆదేశాలు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్