Watch Video: ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించాడు.. ఆ తర్వాత క్షణాల్లోనే..
చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.. నవ్వుతూ కనిపించన వారే.. క్షణాల్లోనే హఠాన్మరణం చెందుతుంటారు. తాజాగా.. ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో డాన్స్ చేస్తూ ఉత్సహాంగా కనిపించిన ఓ వ్యక్తి

Birthday Celebration: చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.. నవ్వుతూ కనిపించన వారే.. క్షణాల్లోనే హఠాన్మరణం చెందుతుంటారు. తాజాగా.. ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో డాన్స్ చేస్తూ ఉత్సహాంగా కనిపించిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలాడు.. హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయిన ఆ వ్యక్తిని కాపాడేందుకు స్నేహితులు అన్ని విధాలుగా ప్రయత్నించారు.. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో చోటుచేసుుంది. దీనికి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IVRI)లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ప్రభాత్ ప్రేమి (45) తన స్నేహితుడు విశాల్ అలియాస్ మనీష్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. ఈ పుట్టినరోజు వేడుకను బరేలీ నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ అంతా కోరడంతో ప్రభాత్ డాన్స్ చేశాడు. డీజేలో వస్తున్న హిందీ పాటలకు చక్కని స్టెప్స్ వేశాడు. కాని డాన్స్ చేస్తుండగానే ఏమయ్యిందో తెలియదు కానీ హఠాత్తుగా కుప్పకూలాడు.




దీంతో స్నేహితులంతా వెంటనే కిందపడిపోయిన ప్రభాత్ దగ్గరకు వచ్చి పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతను కన్నుమూశాడు. పార్టీలో ఉన్న డాక్టర్ వినోద్ పగ్రానీ కూడా.. ప్రభాత్‌కు కార్డియాక్ ప్రెజర్ ఇచ్చారు. మౌత్-టు-మౌత్ బ్రీతింగ్ (CPR) ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. హాస్సిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే.. ప్రభాత్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.
వీడియో చూడండి..
बरेली: खुश दिल इंसान की पल भर में मौत….
◆डांस करते-करते शख्स अचानक गिरा नीचे, डॉक्टरों ने मृत घोषित किया pic.twitter.com/AIOle7W9BA
— News24 (@news24tvchannel) September 2, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం