Bank Strike: రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..

|

Dec 01, 2021 | 10:09 PM

Bank Strike: ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పలు బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే మరి కొన్ని బ్యాంకులు కూడా త్వరలో విలీనం కానున్నాయి...

Bank Strike: రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..
Follow us on

Bank Strike: ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పలు బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే మరి కొన్ని బ్యాంకులు కూడా త్వరలో విలీనం కానున్నాయి. ఈ నేపథ్యంలో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మె నిర్వహించనుంది. దేశంలోని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు డిసెంబర్ 16,17 తేదీలలో రెండు రోజుల సమ్మె చేయనున్నారు. ఈ విషయాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU-United Forum of Bank Unions) తెలిపింది. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ సమ్మె జరుగుతోంది.

ఫిబ్రవరి 1, 2021న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా ఈ సమ్మె చేపట్టనున్నట్లు పేర్కొంది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా తొమ్మిది యూనియన్లతో కూడిన ఉండే ఈ ఫోరం డిసెంబర్ 16 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించింది. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉపసంహరణలో భాగంగా 2019లో ఐడీబీఐ బ్యాంకులోని మెజార్టీ వాటాను ఎల్ఐసీకి విక్రయించింది. నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. బ్యాకింగ్‌ చట్టాల బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రైళ్లను అద్దెకు ఇచ్చేందుకు ‘భారత్‌ గౌరవ్‌ స్కీమ్‌’

EPF Insurance: ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉన్నవారికి అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ ఫామ్‌ పూర్తి చేస్తే రూ.7 లక్షల బెనిఫిట్‌..!