గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

|

Jun 16, 2021 | 8:17 PM

కుంతీదేవి పసిబిడ్డగా ఉన్నప్పుడు కర్ణుడిని నదిలో వదిలిపెట్టేసిందని పురాణం. మిథిల రాజ్యంలో రైతులు పొలం దున్నుతుండగా ఓ పెట్టెలో దొరికిన పసిపాపను..

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!
Baby Girl
Follow us on

కుంతీదేవి పసిబిడ్డగా ఉన్నప్పుడు కర్ణుడిని నదిలో వదిలిపెట్టేసిందని పురాణం. మిథిల రాజ్యంలో రైతులు పొలం దున్నుతుండగా ఓ పెట్టెలో దొరికిన పసిపాపను సీతగా జనక మహారాజు పెంచుకున్నాడని చరిత్ర.. చాలా సినిమాల్లోనూ చూశాం. కానీ, ఉత్తరప్రదేశ్‌లో సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అయింది. దాద్రి ఘాట్ సమీపంలో గంగానదిలో పడవ నడిపే వ్యక్తికి ఓ చెక్కపెట్టె తేలుతూ రావడం కనిపించింది. అందులోంచి ఏడుపు శబ్ధాలు వినిపించడంతో.. అతడు దగ్గరకు వెళ్లి ఆ పెట్టెను తీసుకున్నాడు. ఒడ్డుకు వచ్చి తెరిచి చూసిన జాలరి ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. పెట్టెలో ఎర్రని వస్త్రం, అమ్మవారి ఫొటోలు ఉన్నాయి. వాటితో పాటు ఓ చిన్నారి కూడా ఉండడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

అంతేకాదు అందులో ఆ పాప పుట్టిన తేదీ..సమయం..జాతకం వివరాలతో కూడిన చార్ట్ కూడా ఉంది. ఆ జాతకంలో ఈ చిన్నారి పుట్టిన తేదీ మే 25, అమ్మాయి పేరు గంగా అని రాసిపెట్టారు. అయితే, గంగమ్మ తల్లే తనకు ఈ బిడ్డను ఇచ్చిందని పడవ నడుపుకునే వ్యక్తి మురిసిపోయాడు. తానే బిడ్డను పెంచుకుంటానని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతడి ఇంటికి వెళ్లి ఆరాతీశారు. చిన్నారిని ప్రభుత్వ ఆశాజ్యోతి కేంద్రానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పాప ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. ఐతే పాప తల్లిదండ్రులు ఎవరు? పెట్టెలో పెట్టి నదిలో ఎందుకు వదిలివేశారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

మరోవైపు ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. చిన్నారి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. గంగమ్మ ఒడిలో పాపను కాపాడిన వ్యక్తికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నవజాత శిశువును అంత కర్కశంగా పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read:

ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి

 కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..