బాహుబలి సీన్ రిపీట్.. కొడుకుని భుజంపై కూర్చోబెట్టుకుని నది దాటుతూ తండ్రి మృతి.. కన్నీరు పెట్టించే ఘటన ఎక్కడంటే

|

Oct 14, 2024 | 5:04 PM

శివగామి వరద నీటిలో మునిగిపోతుంది. బాహుబలి రక్షించబడతాడు. ఈ సన్నివేశం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇలాంటి ఘటన నిజ జీవితంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ఓ తండ్రి తన నాలుగేళ్ల కుమారుడిని భుజాన వేసుకుని నది దాటే ప్రయత్నంలో మునిగిపోయాడు. అయితే చివరికి తన ప్రాణం పాయినా తన చిన్నారి ప్రాణం కాపాడుకున్నాడు ఆ తండ్రి.

బాహుబలి సీన్ రిపీట్.. కొడుకుని భుజంపై కూర్చోబెట్టుకుని నది దాటుతూ తండ్రి మృతి.. కన్నీరు పెట్టించే ఘటన ఎక్కడంటే
Man Crosses River With Child
Follow us on

బాహుబలి సినిమాలో ఓ సన్నివేశం నేటికీ ప్రేక్షకుల మనసులో మెదులుతూ ఉంటుంది. అదే రాజమాత శివగామి బాహుబలిని చేతుల మీద ఎత్తి పట్టుకుని వేగంగా ప్రవహిస్తున్న నదిని దాటడానికి ప్రయత్నిస్తుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత.. శివగామి నదిలో మునిగిపోవడం మొదలవుతుంది..అయినా సరే ఆమె తన చేతులను పైకి ఎత్తి పట్టుకుని బాహుబలి ప్రాణాలు కాపాడాలని చూస్తుంది. చివరికి శివగామి వరద నీటిలో మునిగిపోతుంది. బాహుబలి రక్షించబడతాడు. ఈ సన్నివేశం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇలాంటి ఘటన నిజ జీవితంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ఓ తండ్రి తన నాలుగేళ్ల కుమారుడిని భుజాన వేసుకుని నది దాటే ప్రయత్నంలో మునిగిపోయాడు. అయితే చివరికి తన ప్రాణం పాయినా తన చిన్నారి ప్రాణం కాపాడుకున్నాడు ఆ తండ్రి. వివరాల్లోకి వెళ్తే..

జంగీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్‌పూర్ గ్రామానికి చెందిన సురేశ్ బింద్ విజయదశమి రోజు దసరా జాతరను కుటుంబ సభ్యులకు చూపించేందుకు నది దాటి సమీపంలోని గ్రామానికి వెళ్లాడు. జాతర చూసి సురేశ్ బింద్ రాత్రి నది దగ్గర ఉన్న ఘాట్ వద్దకు తిరిగి చేరుకున్నాడు. అయితే అక్కడ నది దాటేందుకు పడవ కనిపించలేదు. వాస్తవానికి పడవ నదికి అవతలి తీరం వైపు ఉంది. నది ఎక్కువ లోతు లేకపోవడంతో.. పడవ వచ్చే వరకూ ఎదురు చూడడం ఎందుకు అని అనుకున్నాడో ఏమో.. సురేష్ బింద్ తన నాలుగేళ్ల కొడుకును భుజాలపై వేసుకుని నదిని దాటడం ప్రారంభించాడు.

తండ్రి భుజాలపై తనయుడు..

సురేశ్ బింద్ నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకోబోతుండగా అకస్మాత్తుగా.. నదిలోని లోతు ఉన్న ప్రాంతంలోకి వెళ్లాడు. ఈ సమయంలో తండ్రి భుజంపై కొడుకు కూర్చున్నాడు. అప్పుడు సురేష్ నదిలో ఉన్న పడవ తాడును పట్టుకున్నాడు. అయితే కొడుకు భుజాలపైనే ఉండడంతో భుజాలపై బరువు పెరగడంతో నీటిలోకి దిగబడి పోయాడు. ఊపిరాడక మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

మృతదేహాన్ని నదిలో నుంచి బయట

తాను మరణం అంచుకు చేరుకున్నాను అని తెలుసుకున్నాడో ఏమో ఆ తండ్రి తన కొడుకు ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశాడు. తన కుమారుడికి పడవ తాడును అప్పగించాడు. కొడుకు అదే తాడు సహాయంతో పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. SDRF బృందం కూడా రంగంలోకి దిగింది. SDRF బృందం రాత్రంతా నదిలో సురేష్ మృత దేహం కోసం వెతుకుతూనే ఉంది. ఉదయం సమీపంలోని గ్రామానికి చెందిన డైవర్ విజయ్ నిషాద్‌కు పోలీసులు ఫోన్ చేశారు. చాలా ప్రయత్నాల తర్వాత విజయ్ నిషాద్ సురేష్ మృతదేహాన్ని నీటిలో నుండి బయటకు తీశాడు.

మిన్నంటుతున్న రోదనలు

మృతుడు సురేశ్‌ బింద్‌ కూలీపని చేసుకుంటూ ఇంటిని నడిపేవాడు. ఈ ఘటనతో గ్రామంలో నిశ్శబ్దం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చూపరుల కళ్లలో నీళ్లు ఆగడం లేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు జంగీపూర్ పోలీస్ స్టేషన్ చీఫ్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..