Ram Mandir – Ayodhya: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రామమందిర తీర్ధ్ ట్రస్ట్ విరాళలను సైతం సేకరించి పనులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రూ. 400 కోట్లతో బస్ స్టేషన్ నిర్మించేందుకు సీఎం యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలోని కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బస్టాండ్ నిర్మాణం జరగుతుందని మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ తెలిపారు. దీంతోపాటు నాలుగు లైన్ల రహదారి కూడా నిర్మించనున్నట్లు తెలిపరాు. రామ మందిరానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పర్యాటలకు వస్తారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికోసం 9 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు.
భక్తులకు అవసరమైన అన్ని అవసరాలను పరిగణనలోకి తీసుకుని నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయోధ్య–సుల్తాన్‌పుర్ రోడ్డులో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించనున్న దీనికి రూ. 20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీని పొడవు 1.5 కిలోమీటర్లు ఉంటుందని, విమానాశ్రయం వరకూ ఈ రోడ్డును విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. అలహాబాద్‌లో అనూప్‌షహార్–బులంద్‌షహర్‌ల మధ్య ఉన్న జీటీ రోడ్ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: