Ayodhya: రామ మందిర ప్రారంభోత్సవ వేళ అయోధ్యలో ఈవీ రిక్షా సేవలను ప్రారంభించిన ఉబెర్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో అయోధ్యలో ఉబెర్ ఆటో డివిజన్ కింద తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా సేవను ప్రారంభించింది. అయోధ్యలో ఉబెర్ ఇంటర్‌సిటీతో పాటు సరసమైన కార్ సర్వీస్ లను త్వరలో ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. రానున్న రోజుల్లో స్థానికులు, పర్యాటకుల ప్రయాణానికి సహాయపడే ప్రయత్నంలో భాగంగా రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకకు ముందు అయోధ్యలో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా సేవలను ప్రారంభించినట్లు ఉబెర్ ప్రకటించింది.

ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఉబెర్ ఈవీ ఆటో రిక్షా సేవలను ప్రారంభించింది. రానున్న కొన్ని రోజుల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని.. ప్రతిరోజూ సుమారు లక్ష మంది పర్యాటకులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో తమ వ్యాపార సామ్రాజ్ఞాన్ని విస్తరించుకోవాలని భావిస్తూ.. అయోధ్యలో తమ కార్యక్రలాపాలను నిర్వహించడానికి చాలా కంపెనీలు సన్నాహాలను ముమ్మరం చేశాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో అయోధ్యలో ఉబెర్ ఆటో డివిజన్ కింద తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా సేవను ప్రారంభించింది. అయోధ్యలో ఉబెర్ ఇంటర్‌సిటీతో పాటు సరసమైన కార్ సర్వీస్ లను త్వరలో ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. రానున్న రోజుల్లో స్థానికులు, పర్యాటకుల ప్రయాణానికి సహాయపడే ప్రయత్నంలో భాగంగా రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకకు ముందు అయోధ్యలో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా సేవలను ప్రారంభించినట్లు ఉబెర్ ప్రకటించింది.
ఎలక్ట్రిక్ ఆటో రిక్షా సేవలు అన్ని ఇతర సేవల మాదిరిగానే క్యాబ్, బుకింగ్ కంపెనీ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. భారీ సంఖ్యలో రైడ్‌లకు అనుగుణంగా వేగంగా బుకింగ్ అయ్యే విధంగా ఈ సేవ మరింత అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు చెప్పారు.
ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ ప్రభ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ, “125 నగరాల్లో ఉబెర్ అందుబాటులో ఉంది. అయోధ్య పర్యాటకానికి సహకరించడానికి.. ఇబ్బందులు లేని ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి.. స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ సర్వీస్ కాలర్ ఉబెర్ ఫ్లెక్స్‌ను గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా భారతదేశంలో పరీక్షించారు. ఈ సేవ ఇప్పుడు ఔరంగాబాద్, అజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, డెహ్రాడూన్, గ్వాలియర్, ఇండోర్, జోధ్‌పూర్ , సూరత్ వంటి ఇతర నగరాలకు విస్తరించబడింది.
మరిన్ని అయోధ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..