Road Accident: ట్రక్ అదుపుతప్పడంతో భారీ రోడ్డు ప్రమాదం.. ఘటనలో కనీసం 30 వాహనాలు..

మహారాష్ట్రలోని పూణే-బెంగళూరు హైవేపై భారీ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి. అదివారం..

Road Accident: ట్రక్ అదుపుతప్పడంతో భారీ రోడ్డు ప్రమాదం.. ఘటనలో కనీసం 30 వాహనాలు..
Pune Road Accident
Follow us

|

Updated on: Nov 21, 2022 | 12:11 PM

మహారాష్ట్రలోని పూణే-బెంగళూరు హైవేపై భారీ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి. అదివారం సాయంత్రం పూణే-బెంగళూరు హైవేపై నవాలే వంతెన వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 48 వాహనాలకు డామేజ్ అయిందని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పూణే అగ్నిమాపక దళం, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎమ్‌ఆర్‌డిఎ) సహాయక చర్యలు చేపట్టిందని పూణే ఫైర్ బ్రిగేడ్ అధికారి ఒకరు తెలిపారు.

నవాలే వంతనపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కొంత మంది గాయపడ్డారని సిన్హ్‌గడ్ రోడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఆయన అన్నారు. వంతెన మీదగా వెళ్తున్న ట్రక్కు బ్రేక్ ఫెయిల్యూర్ కావడం వల్ల లేదా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఇది జరిగిందని ఆయన చెప్పారు. ప్రమాద స్థలంలో అనేక వాహనాలు దెబ్బతిన్నాయని.. అగ్నిమాపక దళం, పోలీసు సిబ్బందితో పాటు అటుగా వెళ్తున్న కొందరు కూడా సహాయక చర్యలలో పాల్గొన్నారని స్థానికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ ప్రమాదంలో కార్లు, ఆటోలు, బైక్‌లు బాగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా హైవేపై నాలుగైదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే  స్థానికి పోలీసుల నుండచి సమాచారం తెలుసుకున్నారు. ఇంకా  ఎవరిదైనా నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా.. లేదా డ్రైవర్ నియంత్రణ  కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందా.. అనే దానిపై దర్యాప్తు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ప్రమాదంలో క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..