AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2022 FIFA World Cup: ఫుట్‌బాల్‌పై మరీ ఇంత అభిమానమా..? కేరళలో ఏకంగా 23 లక్షలు ఖర్చు చేసి..

ఖతర్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ ఎక్కువయింది. మన దేశంలో ముఖ్యంగా కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు  ఆటపై తమ ప్రేమాభిమానాలను..

2022 FIFA World Cup: ఫుట్‌బాల్‌పై మరీ ఇంత అభిమానమా..? కేరళలో ఏకంగా 23 లక్షలు ఖర్చు చేసి..
Kerala Football Fans
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 21, 2022 | 9:37 AM

Share

ఆదివారం ఖతర్ వేదికగా ప్రారంభమయిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రపంచ ఫుట్‌బాల్ ప్రియులకు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓ సారి వచ్చే పండుగ వంటిది. ఇలా అనడంలో ఇసుమంత కూడా అతిశయోక్తి లేదు. ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే ఆకలిదప్పికలు మరిచిపోయే అభిమానులు కొన్ని కోట్ల మందే ఉన్నారు. అలాంటి అభిమానులు మన దేశంలోనూ ఉన్నారంటే నమ్ముతారా..? అసలు ఫుట్‌బాల్ టీమ్ లేని దేశంలో అభిమానులు ఎలా అనుకుంటున్నారా..? భారత్ వద్ద ఫుట్‌బాల్ టీమ్ లేకపోవచ్చు కానీ అభిమానుల సంఖ్య మాత్రం తారాస్థాయిలోనే ఉంది. ముఖ్యంగా ఖతర్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ ఎక్కువయింది. మన దేశంలో ముఖ్యంగా కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు  ఆటపై తమ ప్రేమాభిమానాలను విభిన్న రీతిల్లో ప్రకంటించుకుంటున్నారు.కేరళకు చెందిన కొందరు కూడా ఇదే తరహాలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేరళలోని కొచ్చి జిల్లా ముండక్కముగల్ గ్రామానికి చెందిన 17 మంది స్నేహితుల బ‌ృందం ఫుట్‌బాల్‌పై మక్కువతో ఏకంగా ఇంటినే కొనుగోలు చేశారు.

అందరూ కలిసి ఒకేచోట మ్యాచ్‌ను చూసేందుకు వీలుగా 23 లక్షల రూపాయలతో ఆ ఇంటిని కొనుగోలు చేసి దానిని ఒక మినీ హాల్‌గా మార్చుకున్నారు. ప్రపంచ కప్ నేపథ్యంతో వారు కొనుగోలు చేసిన ఇల్లు బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ జెర్సీ రంగులతో ఉంది. మరో విశేషమేమిటంటే ఈ స్నేహితులందరూ కలిసి లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో సహా ఫుట్‌బాల్‌ ఆటలోని సీనియర్ ప్లేయర్లలో కొంతమంది ఫొటోలతో తమ ఇంటిని అలంకరించారు. ‘‘ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా మా 17 మంది కలిసి  ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ప్లాన్ చేసాము. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ ఇంటిని రూ. 23 లక్షలకు కొనుగోలు చేసి ఇప్పటికే  ఫిఫా జట్ల జెండాలతో అలంకరించాము. మేము ఇక్కడ గుమికూడి పెద్ద స్క్రీన్ టీవీలో మ్యాచ్‌ని చూడాలని అనుకున్నాము” అని వారిలో ఒకరైన షెఫిర్ పా తెలిపారు. వీరు అసలు ఈ ఇంటిని కొనుగోలు చేయక ముందే ఆటను చూసే ఆనవాయితీని ఆ గ్రామంలోకి తీసుకువచ్చారు. ఇల్లు కొనాలని నిర్ణయించుకోవడానికి చాలా కాలం ముందు, వారు కలిసి ఫుట్‌బాల్ ఆటలను చూసే సంప్రదాయాన్ని స్థాపించారు.

ఇవి కూడా చదవండి

‘‘భవిష్యత్తులో కూడా తర్వాతి తరంవారు కూడా ఫుట్‌బాల్‌ను ఆస్వాదించవచ్చు. ఇలాగే రానున్న వారి మధ్య కూడా ఐక్యత కొనసాగుతుంది. ఓ పెద్ద టీవీని తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. మాతో పాటు అందరూ ఇక్కడికి వచ్చి ఫుట్‌బాల్‌ను కలిసి ఆస్వాదించేలా చూస్తాము’’ అని షెఫిర్ చెప్పారు. కాగా, నవంబర్ 20 ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమయిన వరల్డ్ కప్ ఖతార్ 2022 టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో.. ఆతిథ్య ఖతర్ జట్టుతో ఈక్వెడర్ తలపడింది. ఈ ఆటలో ఈక్వెడర్ 20 ఆధిక్యంతో ఖతర్ జట్టుపై గెలుపొందింది. ఈక్వెయర్ సాధించిన ఈ తొలి విజయంలో జట్టు ఆటగాడు ఎన్నర్ వెలాన్సియా హీరోగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..