మోదీ విజయాన్ని ముందే ఊహించిన జ్యోతిష్కుడు కన్నుమూత..!

ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ దరువల్లా(88) కన్నుమూశారు. న్యుమోనియా, బ్రెన్ హైపోక్సియా(మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం) వంటి సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన.

మోదీ విజయాన్ని ముందే ఊహించిన జ్యోతిష్కుడు కన్నుమూత..!

ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ దరువల్లా(88) కన్నుమూశారు. న్యుమోనియా, బ్రెన్ హైపోక్సియా(మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం) వంటి సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన.. గాంధీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే ఆయన కరోనాతో మరణించారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన కరోనా బాధితుల లిస్ట్‌లో ఆయన పేరు ఉందని కొందరు అంటున్నారు. అయితే ఆ వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు.

జూలై 11, 1931లో జన్మించిన బెజన్.. వేదిక్, న్యూమరాలిజీ, పాల్‌మిస్ట్రీ, టరోట్ వంటి జ్యోతిష్యాల్లోను పేరు గడించారు. గణేష్‌ స్పీక్స్‌ పేరుతో ఆయన ఓ జ్యోతిష్య వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. వాజ్‌పేయి, మొర్జారీ దేశాయ్‌ ప్రధానులు అవుతారంటూ బెజన్‌ ముందుగానే చెప్పారు. అలాగే నరేంద్ర మోదీ కూడా ప్రధాని అవుతారని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు రాజీవ్ గాంధీ హత్య, సంజయ్ గాంధీకి ప్రమాదం, భోపాల్ విషాదం వంటి ఘటనలను ఆయన ముందుగానే ఊహించి చెప్పారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన ఓ వీడియోలో గణేషుడి ఆశీస్సులతో మే 21 తరువాత దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుందని బెజన్ వెల్లడించారు.

మరోవైపు బెజన్ మరణంపై కుమారుడు నస్తూర్ దరావుల్లా ఓ ప్రకటన ఇచ్చారు. ”ఆయన ఓ గొప్ప ఫైటర్. చివరి శ్వాస వరకు ఆయన ధైర్యంగా పోరాడారు. కరోనా వైరస్ త్వరలోనే పోతుందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది భారత దేశం గొప్ప శక్తిగా ఎదుగుతుందని అన్నారు” అని తెలిపారు. కాగా బెజన్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Read This Story Also: అలాంటి ఇళ్లలో ఉంటే కరోనా ముప్పు ఎక్కువేనట..!