అలాంటి ఇళ్లలో ఉంటే కరోనా ముప్పు ఎక్కువేనట..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగున్నాయి. ఈ వైరస్ తీవ్రత ఎలా ఉండబోతుంది..?

అలాంటి ఇళ్లలో ఉంటే కరోనా ముప్పు ఎక్కువేనట..!
Follow us

| Edited By:

Updated on: May 30, 2020 | 8:05 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగున్నాయి. ఈ వైరస్ తీవ్రత ఎలా ఉండబోతుంది..? కరోనా ఏ విధంగా ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి..? ఈ మహమ్మారి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది..? దీనికి అడ్డుకట్ట వేయడం ఎలా..? వంటి ప్రశ్నలపై శాస్త్రవేత్తల అధ్యయనం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. యూకేలోని సర్రే యూనివర్సిటీ పరిశోధకులు ప్రశాంత్ కుమార్ నేతృత్వం వహించిన టీమ్ ఈ విషయాన్ని తెలిపింది. దీనిపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఎన్విరాన్‌మెంటల్ ఇంటరాక్షన్ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది.

దాని ప్రకారం..  కోవిడ్ 19 వైరస్ 100 మైక్రోన్‌ల కంటే తక్కువ సైజ్ కలిగి ఉంటుందని వివరించారు. మనుషులు వదిలే గాలి, తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వచ్చే సూక్ష్మ బిందువుల్లోని నీరు ఆవిరైపోయినా.. వైరస్ కణాలు మాత్రం పరిసరాల్లోనే ఉండిపోతాయని వారు తెలిపారు. ఇక ఏసీలు ఉన్నప్పటికీ, వాటి పనితీరు సమర్ధంగా లేకపోతే ప్రమాదం ఉన్నట్లేనని పేర్కొన్నారు. అందుకే గాలి వెలుతురు సరిగా లేని ఇళ్లలో ఉంటే వైరస్ ముప్పు అధికంగా ఉన్నట్లేనని వారు వివరించారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు వెంటిలేషన్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రశాంత్ కుమార్ తెలిపారు.  దీనిపై లోతైన పరిశోధనలు జరుపుతున్నట్లు ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.

Read This Story Also: టాటా సన్స్‌కి నోటీసులు జారీ చేసిన సుప్రీం..!