Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏయే రాష్ట్రాల్లో ఎవరిది ఆధిపత్యం అంటే…

Assembly Election Exit Poll Result 2026: ఎగ్జిట్‌పోల్‌... ఫలితాలు కానీ ఫలితాలు. అసలు రిజల్ట్‌ వచ్చేదాకా ఇవే అందరికీ ఊరట. నరాలు తెగే ఉత్కంఠ రేపు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నేతలకు, కార్యకర్తలకు, ఆసక్తిగా చూసే ప్రజలకు ఎగ్జిట్‌ పోల్‌ ఖచ్చితంగా ఊరటనిస్తుంది. అయితే చాలా సందర్భాల్లో ఎన్నికల ఫలితాలు తారుమారు అయిన సందర్భాలున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన సర్వేలు కూడా తప్పుయిన ఘటనలున్నాయి. వందశాతం నమ్మకం ఉండదు.. కానీ అసలు పలితం వచ్చేదాకా అయితే మాత్రం అవే ప్రాతిపదిక అవుతాయి.

Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏయే రాష్ట్రాల్లో ఎవరిది ఆధిపత్యం అంటే...
exit poll 2026

Updated on: Apr 29, 2026 | 7:18 PM

తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు దేశంలో ప్రధానపార్టీలకు అత్యంత కీలకం. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీలకే కాదు.. దేశ రాజకీయాలను శాసిస్తున్న ప్రాంతీయపార్టీలు TMC, DMK, లెఫ్ట్ పార్టీల భవితవ్యం కూడా వీటిపై ఆధారపడి ఉన్నాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, కులగణన, SIR వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారాయి. అదే సయయంలో ఉత్తర, దక్షణ భారత నినాదాలు కూడా తెరమీదకు వచ్చాయి.

పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి, టిఎంసీకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అక్కడ ఎవరు గెలుస్తారన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది. వరుసగా నాలుగోసారి గెలుపు లక్ష్యంగా మమత బెనర్జీ సర్వశక్తులూ ఒడ్డారు.. ఒక్కో అడుగు వేసుకుంటూ ప్రధాన ప్రత్యర్థిగా మారిన బీజేపీ విజయాన్ని నరేంద్రమోదీ, అమిత్‌షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హ్యాట్రిక్‌ విజయాలతో దూకుడుమీద ఉన్న టీఎంసీకి బ్రేకులు వేస్తుందా?

అటు తమిళనాడు ఎన్నిక కూడా అత్యంత కీలకం. సౌత్‌ఇండియాలో అతిపెద్ద రాజకీయశక్తుల్లో ఒక్కటైన DMK వరసగా రెండోవిజయం కోసం తహతహలాడుతోంది. జయలలిత మరణం తర్వాత బీజేపీతో జతకట్టిన AIDMK కూడా విజయంపై ధీమాగా ఉంది. వీరి మధ్య పోటీలో నటుడు విజయ్‌ సారథ్యంలోని TVK ప్రధానశక్తిగా అవతరించారు. ఆయన కింగ్‌ అవుతారా? కింగ్‌ మేకర్‌ అవుతారా అంటూ చర్చలు మొదలయ్యాయి.

ఇక కేరళంలో హ్యాట్రిక్‌ విజయంపై లెఫ్ట్‌ ఫ్రంట్ ఆశలుపెట్టుకుంది. అయితే కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF బలంగా ఉంది. వారి మధ్య పోటీ నువ్వా- నేనా అన్నట్టుగా ఉంది. ఇక అసోంలో హిమంత మరోసారి సీఎం కావాలన్న లక్ష్యంతో ఊరూవాడా ప్రచారం చేశారు. హిందుత్వ అజెండాగా బలంగా జనాల్లోకి తీసుకెళ్లారు. అటు ప్రత్యర్ధి పార్టీలు కూడా తమదైన మతపరమైన అస్త్రాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో NR కాంగ్రెస్‌ విజయంపై ధీగా ఉండగా.. కాంగ్రెస్‌ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. కొత్తగా రంగంలో దిగిన విజయ్‌ పార్టీ TVKప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది.

యాక్సిస్‌ మై ఇండియా సర్వే ప్రకారం.. అస్సోం బీజేపీకే మళ్లీ పట్టం

–అధికార బీజేపీ కూటమి 88-100; కాంగ్రెస్‌ కూటమి 24-36; ఇతరులు 0-3 సీట్లు గెలిచే చాన్స్ ఉన్నట్లు అంచనా…

 

పీపుల్స్ పల్స్‌ సర్వే ప్రకారం…

— పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 177-187; బీజేపీ 95-100, కాంగ్రెస్‌ 0, లెఫ్ట్‌ 0-1, ఇతరులు 1-2

–తమిళనాడులో డీఎంకే కూటమి 125 – 145; ఏఐడీఎంకే కూటమి 65 -80; టీవీకే 18-24; ఇతరులు 2-6 దక్కే చాన్స్

–కేరళలో LDFకు 55-65; UDFకు 75-87, ఎన్డీయే 0-3; ఇతరులు 0

–పుదుచ్చేరిలో బీజేపీ కూటమికి 16-19; కాంగ్రెస్‌ కూటమికి 10-12; ఇతరులు 1-2

–అసోంలో భాజపా కూటమికి 68-72; కాంగ్రెస్‌ కూటమికి 22-26; ఇతరులు 3-5

 

వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దిగువన పట్టికలో చూడండి… 

Follow Us