Assam Floods 2022: స్త్రీ శక్తికి అన్నింటా సగం.. నిస్సహాయులకు అండగా రైఫిల్‌ ఉమెన్‌ టీమ్‌.. సలాం అంటున్న బాధితులు

|

Jul 03, 2022 | 10:36 AM

అస్సాంలోని అనేక ప్రాంతాల్లో ప్రమాద స్థాయికి మించి నీరు పెరగడంతో, ఈ ప్రాంతంలోని కాలనీలు నీట మునిగిపోయాయి మేమున్నామంటూ రంగంలోకి దిగింది రైఫిల్‌ ఉమెన్‌ టీమ్‌.

Assam Floods 2022: స్త్రీ శక్తికి అన్నింటా సగం.. నిస్సహాయులకు అండగా రైఫిల్‌ ఉమెన్‌ టీమ్‌.. సలాం అంటున్న బాధితులు
Assam Women Rifles
Follow us on

Assam Floods 2022: చినికి చినికి గాలివానైంది. చిన్ని చిన్ని చినుకులతో ప్రారంభమైన వర్షం భారీ వర్షంగా మారి వరదై అస్సాం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. అనేకమంది వరదల్లో చిక్కుకుపోయి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సహాయం కోసం నిస్సహాయంగా ఎదురు చూస్తున్నారు. అస్సాంలోని పలు జిల్లాల్లో వరదలు భీభత్సం సృష్టించాయి. వరదల బారిన పడిన ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. ముఖ్యంగా కచర్‌ జిల్లా వరదల దెబ్బతో అల్లకల్లోలమైపోయింది. ఆ కల్లోలంలో ‘బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు అనే బతుకు మీద ఆశ.. ఈ సమయంలో మనం ఎలా సురక్షితంగా ఉండాలని అన్న ఆలోచన సర్వసాధారణం. ఇదే సమయంలో మేమున్నామంటూ రంగంలోకి దిగింది రైఫిల్‌ ఉమెన్‌ టీమ్‌.

అస్సాంలోని సిల్చార్ పట్టణంలోని రంగీర్ ఖరీ ప్రాంతంలో ప్రమాద స్థాయికి మించి నీరు పెరగడంతో, ఈ ప్రాంతంలోని  కాలనీలు నీట మునిగిపోయాయి. పౌర ఆవాసాలు ముంపునకు గురయ్యాయి. చాలా మంది భారీ వరదల్లో చిక్కుకుపోయారు.. అమూల్యమైన ప్రాణాలను రక్షించడానికి, పెరుగుతున్న నీటి మట్టాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితులకు మేమున్నామని అండగా నిలబడుతున్నారు రైఫిల్‌ ఉమెన్‌ టీమ్‌.

ఓ వ్యక్తి వాగు దాటి అవతలి ప్రాంతానికి వెళదామని ప్రయత్నించి వరదలో పడి కొట్టుకుపోతూ ఎక్కడో విరిగిపడిన చెట్ల కొమ్మలు ఇరుక్కుపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రైఫిల్‌ మహిళల బృందం రంగంలోకి దిగింది. అతడిని రక్షించింది.

ఇవి కూడా చదవండి

వరదలో చిక్కుకుపోయి.. వరదను ఈదుకుంటూ.. బయటపడే శక్తిలేక నిస్సహాయంగా బిక్కుబిక్కుమంటూ నిస్సహాయంగా  చూస్తున్న వృద్ధురాలిని చంటిబిడ్డలా చంకనెత్తుకుని కాపాడారు   రైఫిల్‌ ఉమెన్‌ టీమ్‌. ఇలా వరదల్లో చిక్కుకున్న నిస్సహాయులను , పిల్లలను, వృద్ధులను ఎంతోమందిని వరద బయటకు తీసుకుని వచ్చి బాధితుల ప్రాణాలు రక్షించారు.

తాము  ‘రైఫిల్‌ ఉమెన్‌’ బృందంలోని వారికి ‘రెండు చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పడం తప్ప వారి రుణం ఎలా తీర్చుకోగలం’ అని కన్నీరు పెట్టిందో మహిళ.  అస్సాంలో  ‘రైఫిల్‌ ఉమెన్‌’ బృందాలకుమంచిపేరు ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు, సహాయ కార్యక్రమాలు చేస్తూ.. మంచి పేరు తెచ్చుకుంది బృంద.

ఈ బృందంలో పనిచేయడం తనకు గర్వకారణం అని సభ్యులు చెబుతుంటారు. అస్సాంలోని దుర్బీ ప్రాంతానికి చెందిన మంతిదాస్‌ తన తల్లిదండ్రుల అభ్యంతరాలను పట్టించుకోకుండా.. రైఫిల్‌ ఉమెన్‌ బృందంలో చేరింది. తాము చేస్తున్న  సహాయకార్యక్రమాల ఫోటోలను చూసి.. తన తల్లిదండ్రులు ఎంతో గర్వపడతారని చెబుతున్నారు ‘రైఫిల్‌ ఉమెన్‌’  లోని సభ్యులు.  యతిర్‌,మంతిదాస్ వంటి అనేక మంది మహిళా సైనికులు అసాధారణమైన సాహసాలు ప్రదర్శిస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆడుకుంటున్నారు. జనంతో నీరాజనాలు అందుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.