Himanta Biswa Sarma On CM KCR: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. రాహుల్.. రాజీవ్ గాంధీ (Rahul Gandhi) కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో అస్సాం సీఎంను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీని సీఎం కేసీఆర్ (CM KCR) డిమాండ్ చేశారు. భారత స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు ప్రాణాలు ఇచ్చారని.. అలాంటి వారిపై ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇదేనా ధర్మం, హిందూత్వం అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్. కాగా.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు అస్సాం సీఎం కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రయిక్‌పై రాహుల్ ఆధారాలు అడిగారు.. బిపిన్ రావత్‌పై వ్యాఖ్యలు చేశారంటూ అసోం సీఎం పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులపై మాట్లాడకుడదా అంటూ ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకుడదా అంటూ హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. కేసీఆర్‌కు తాను మాట్లాడిందే తప్పులా అనిపించిందా..? అంటూ అస్సాం సీఎం వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తాను చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ సీఎం కేసీఆర్ రెచ్చిపోయారు.. కానీ మన సైన్యంపై గాంధీ మాట్లాడిన అంశంపై ఎందుకు మాట్లాడలేదన్నారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించకూడదన్న ఈ ఆలోచనా ధోరణి మారాలి అంటూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అంతేకాకుండా పలు స్టేషన్లల్లో ఫిర్యాదులు సైతం ఇచ్చారు కాంగ్రెస్ శ్రేణులు.
Also Read: