Ashwini Vaishnaw: మెటాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. ఏమన్నారంటే?

|

Jan 13, 2025 | 6:12 PM

Ashwini Vaishnaw: ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. అలాగే, మెటా యాజమాన్యం చేసిన ఆరోపణలు కూడా తప్పని నిరూపితమైందంటూ చెప్పుకొచ్చారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సంఘం 2024లో ఎన్నికలను సక్రమంగా నిర్వహించలేకపోయిందంటూ విమర్శలు వినిపిస్తోన్న తరుణంలో రైల్వే మంత్రి ఇలాంటి ట్వీట్‌తో కౌంటర్ ఎటాక్ చేశారు.

Ashwini Vaishnaw: మెటాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. ఏమన్నారంటే?
Union Minister Ashwini Vaishnaw
Follow us on

Ashwini Vaishnaw: ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో మెటా యాజమాన్యం వ్యాప్తి చేసిన ఆరోపణలు కూడా తప్పని నిరూపితమైందంటూ చెప్పుకొచ్చారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సంఘం 2024లో ఎన్నికలను సక్రమంగా నిర్వహించలేకపోయిందంటూ వినిపిస్తోన్న విమర్శల నేపథ్యంలో రైల్వే మంత్రి ఇలాంటి ట్వీట్‌తో కౌంటర్ ఎటాక్ చేశారు. అలాగే, పీఎం నరేంద్ర మోడీ పాలనపై ప్రజలకు నమ్మకం కలిగిందని, అందకే 3వసారి విజయం అందించారని అన్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలోనూ, ఆ తర్వాత సహాయ కార్యక్రమాలు చేయడంతో పీఎం మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ట్వీట్ చేస్తూ ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 2024 ఎన్నికలను పకడ్బందీగా జరిగాయి. దాదాపు 640 మిలియన్లకుపైగా ఓటర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై భారత ప్రజలు తమ నమ్మకాన్ని చూపించారు’ అని అన్నారు.

ఈ క్రమంలో 2024 ఎన్నికలలో భారతదేశంతో సహా చాలా అధికార ప్రభుత్వాలు కోవిడ్ తర్వాత ఓడిపోయాయనే మిస్టర్ జుకర్‌బర్గ్ వాదన తప్పుగా నిరూపితమైందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

800 మిలియన్ల మంది ప్రజటకు ఉచిత ఆహారం నుంచి 2.2 బిలియన్ల ఉచిత వ్యాక్సిన్‌ల వరకు.. అలాగే కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలకు సహాయం చేయడం నుంచి, భారతదేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నడిపించడం వరకు ప్రధానమంత్రి మోడీ నిర్ణయాత్మక వ్యవరించారరు. అందుకే పీఎం నరేంద్ర మోడీకి 3వ సారి ప్రజలు పట్టం కట్టారు. సుపరిపాలన, ప్రజల విశ్వాసానికి ఇదే నిదర్శనం’ అంటూ చెప్పుకొచ్చారు.

‘మిస్టర్ జుకర్‌బర్గ్ అందించిన సమాచారం ఎంతో నిరాశపరిచింది. వాస్తవాలు, విశ్వసనీయతతో ఇలాంటి సమాచారం తప్పుని ప్రజలు నిరూపించారు’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..