Asaduddin Owaisi: ఆరోజు బెంగళూరులో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం..కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్..
కర్ణాటక ప్రభుత్వం తీరుపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగష్టు 31వ తేదీన బెంగళూరు నగరంలో
Asaduddin Owaisi: కర్ణాటక ప్రభుత్వం తీరుపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగష్టు 31వ తేదీన బెంగళూరు నగరంలో మాంసం విక్రయాలు నిషేధిస్తూ బృహత్ బెంగళూర్ మహానగర పాలికె (BBMP) నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి రోజు మాంసం విక్రయాలతో పాటు జంతు వధను నిషేధించామని, ఈఉత్తర్వులు బృహత్ బెంగళూర్ మహానగర పాలికె పరిధిలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈనిర్ణయంపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దృష్టిలో ఈనిర్ణయం మంచిదే కావచ్చు. కాని ఈవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మందికి ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొన్నారు. తక్షణమే ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం సంపన్నవర్గాలకు కొమ్ముకాసే సర్కార్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాంసం విక్రయాలపై నిషేధం విధించడం వృత్తి హక్కును నిరాకరించడంతో పాటు జీవనోపాధి, స్వేచ్చ వంటి హక్కులను కాలరాయడమేనని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. బెంగళూరులో వినాయక చవితి సందర్భంగా మాంసం విక్రయాలు నిషేధిస్తూ తీసుకున్న నిర్ణం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. కర్ణాటకలోని 80 శాతం మంది మాంసాహారులు ఉన్నారని, ఎక్కువుగా ఈవ్యాపారం చేసేది ముస్లీంలేనని, అందుకే బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈనిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఐటీ నగరం బెంగళూరులో మాంసం విక్రయాలు నిలిపివేసి ప్రపంచానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని అసదుద్దీన్ ఓవైసీ కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో కృష్ణాష్ణమి సందర్భంగా కూడా బృహత్ బెంగళూర్ మహానగర పాలికె పరిధిలో మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..