AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyendar Jain: కట్టల గుట్టలు.. కుప్పలు కుప్పలుగా గోల్డ్ కాయిన్స్.. మంత్రి ఇంట్లో ఈడీ స్వాధీనం

సత్యేంద్ర జైన్ ఇళ్లు, కార్యాలయాలతోపాటు.. ఆయనతో సన్నిహితంతగా ఉండే వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దాడులు కొనసాగుతున్నాయి.

Satyendar Jain: కట్టల గుట్టలు.. కుప్పలు కుప్పలుగా గోల్డ్ కాయిన్స్.. మంత్రి ఇంట్లో ఈడీ స్వాధీనం
Satyendar Jain
Shaik Madar Saheb
|

Updated on: Jun 07, 2022 | 5:31 PM

Share

Delhi Minister Satyendar Jain: హవాలా కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, సత్యేంద్ర జైన్ ఇళ్లు, కార్యాలయాలతోపాటు.. ఆయనతో సన్నిహితంతగా ఉండే వారిపై దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు చెందిన అత్యంత సన్నిహితుల నివాసాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడిలో 2 కోట్ల 82 లక్షల నగదు, కిలో బంగారాన్ని దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. సత్యేంద్ర జైన్ సన్నిహితుల లొకేషన్ల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 133 బంగారు నాణేలను స్వాధీనం చేసుకుంది. హవాలా లావాదేవీల కేసులో సత్యేంద్ర జైన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సత్యేంద్ర జైన్ ED కస్టడీలో ఉన్నారు.

అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ సహాయకుడిపై నుంచి 2.82 కోట్ల నగదు, కేజీ 800 గ్రాముల 133 బంగారు నాణేలు లభ్యమైనట్లు ఈడీ అధికారులు తెలిపారు. అతని సన్నిహితుడి దాచిన ప్రదేశం నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

కాగా.. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో.. ఈడీ అధికారులు మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015 – 16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు, షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది.

ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌ జైన్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆయన్ను అరెస్టు చేసి పలు చోట్ల దాడులను నిర్వహిస్తోంది. కాగా.. జైన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9వ వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్