AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎట్టకేలకు చిక్కిన అరికొంబన్ ఏనుగు.. ఎలా పట్టుకున్నారంటే

Elephant Arikomban: తమిళనాడులోని ఇటీవల తేని జిల్లాలో అరికొంబన్ అనే ఏనుగు బీభత్సం సృష్టించించిన విషయం తెలిసిందే. పలు గ్రామాల్లో అయితే 144 సెక్షన్‌ను కూడా విధించారు. ఇప్పటికే ఈ ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని పట్టుకునేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు.

Aravind B
|

Updated on: Jun 05, 2023 | 12:54 PM

Share

తమిళనాడులోని ఇటీవల తేని జిల్లాలో అరికొంబన్ అనే ఏనుగు బీభత్సం సృష్టించించిన విషయం తెలిసిందే. పలు గ్రామాల్లో అయితే 144 సెక్షన్‌ను కూడా విధించారు. ఇప్పటికే ఈ ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని పట్టుకునేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. దాదాపు 20 రోజుల నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా భయాందోళనకు గురిచేస్తోన్న ఈ ఏనుగు ఎట్టకేలకు అధికారులకు పట్టుబడింది. సోమవారం తెల్లవారుజామున కంబమ్ ఈస్ట్ రేంజ్‌లో ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్లు, అటవీ శాఖ అధికారుల బృందం దానికి 2 మత్తు ఇంజెక్షన్ షాట్లు వేసి  చాకచక్యంగా పట్టుకున్నారు.

అయితే ఈ పట్టుబడిన అరి కొంబన్ ఏనుగును తేని జిల్లాకు ఆనుకుని ఉన్న వెల్లిమలై ప్రాంతంలో విడిచిపెట్టాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఏనుగుకు చాలా గాయాలు కావడంతో.. చికిత్స కోసం తొలుత ముడుమలై అటవీ ప్రాంతానికి వెళ్లనున్నారు. అనంతరం దాన్ని అడవిలో విడిచిపెట్టాలని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏనుగును ఏ ప్రాంతంలో విడుదల చేయబోతున్నారనే దానిపై అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. ప్రభుత్వం నుంచి
రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. ప్రభుత్వం నుంచి
గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మళ్లీ..
గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మళ్లీ..
టెడ్డీని కౌగిలించుకుంటే ఇంత సుఖమా? టెడ్డీ డే స్పెషల్ స్టోరీ
టెడ్డీని కౌగిలించుకుంటే ఇంత సుఖమా? టెడ్డీ డే స్పెషల్ స్టోరీ
ధోని, కోహ్లీలు ఒంట్లో పూనారా.. అసలేంది ఈ క్లాస్ ఫినిషింగ్‌
ధోని, కోహ్లీలు ఒంట్లో పూనారా.. అసలేంది ఈ క్లాస్ ఫినిషింగ్‌
ఇరుముడి మూవీకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కదా..
ఇరుముడి మూవీకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కదా..
బాడీ మిస్టరీ.. జుట్టు, గోళ్లు కత్తిరిస్తే నొప్పి ఎందుకు ఉండదో..
బాడీ మిస్టరీ.. జుట్టు, గోళ్లు కత్తిరిస్తే నొప్పి ఎందుకు ఉండదో..
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
లైట్ తీసుకుంటారు కానీ.. దివ్యౌషధం.. ఉదయాన్నే ఒక్కటి తింటే చాలు..
లైట్ తీసుకుంటారు కానీ.. దివ్యౌషధం.. ఉదయాన్నే ఒక్కటి తింటే చాలు..
ఆధార్, పాన్ ఉందా..? రూ.5 లక్షల లోన్ పొందండి
ఆధార్, పాన్ ఉందా..? రూ.5 లక్షల లోన్ పొందండి
ఏం చూస్తున్నారా.. ? 14 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సినిమా..
ఏం చూస్తున్నారా.. ? 14 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సినిమా..