పంజాబీ రాఫెల్ విమానం ఎక్కి చూద్దామా ? ఎగరలేని ఫ్లైట్ లో సరదాగా షికారు చేద్దామా ?
పంజాబ్ లోని భటిండా జిల్లాలో ఆర్కిటెక్ట్ ఒకరు భలే విమానాన్ని తయారు చేశారు. పంజాబ్ రాఫెల్ పేరిట రూపొందించిన ఈ విమానం జెట్ రాఫెల్ ఫ్లైట్ మాదిరే ఉంటుంది గానీ ఎగరజాలదు.
పంజాబ్ లోని భటిండా జిల్లాలో ఆర్కిటెక్ట్ ఒకరు భలే విమానాన్ని తయారు చేశారు. పంజాబ్ రాఫెల్ పేరిట రూపొందించిన ఈ విమానం జెట్ రాఫెల్ ఫ్లైట్ మాదిరే ఉంటుంది గానీ ఎగరజాలదు. రూ. 3 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ విమానం గంటకు 15 కి.మీటర్ల నుంచి 20 కిలోమీటర్లవరకు ప్రయాణించగలదట .తాను రూపొందించాడు గనుక దీనికి రామ్ పాల్ ఎయిర్ లైన్స్ అని ఆ ఆర్కిటెక్ట్ దీనిపై రాసుకున్నాడు. రూఫ్ లేని ఈ పంజాబీ ఫ్లైట్.. కి రెండు వైపులా మిర్రర్స్, విండ్ షీల్డ్ ఉన్నాయి. భటిండాలోని కల్చరల్ పార్క్ లో త్వరలో దీన్ని ప్రదర్శిస్తామని రామ్ పాల్ తెలిపారు. విమానం ఎక్కి ప్రయాణించాలని కలలు కంటూ కూడా స్తోమత లేని వారు ఈ విమానం ఎక్కి తమ సరదా తీర్చుకొవచ్చునని ఆయన అంటున్నారు. రాఫెల్ జట్ విమానం చూసి స్ఫూర్తి పొంది తాను దీన్ని తయారు చేసినట్టు ఆయన చెప్పారు.
భారత వైమానిక దళంలోకి తొలి రఫెల్ విమానాన్ని గత ఏడాది సెప్టెంబరు 10 న ప్రవేశపెట్టారు. ఈ మాసాంతానికి మొత్తం 17 రాఫెల్ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్దకు చేరనున్నాయి. అత్యంత శక్తిమంతమైన ఫైటర్ విమానాలుగా పాపులర్ అయిన వీటిని ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేస్తోంది. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ వంటి విపక్షాలు లోగడ ఆరోపించడం , వాటిని సుప్రీంకోర్టు కొట్టివేయడం తెలిసిందే. లడాఖ్లో నియంత్రణ రేఖ వద్ద ఆ మధ్య చైనా తన దళాలతో ఉద్రిక్తతను సృష్టించినప్పుడు అవసరమైతే ఆ దేశ యుధ్ద విమానాలను టార్గెట్ గా చేసుకుని రాఫెల్ ఫైటర్లను వినియోగించాలని ఒక దశలో భారత వైమానిక దళం యోచించింది. అందువల్లే వీటి కొనుగోలు పట్ల ఆసక్తి చూపింది.
Punjab: Architect designs jet-shaped vehicle that runs at 15-20km/h speed in Bathinda’s Rama Mandi. pic.twitter.com/NBLWCLA8RJ
— ANI (@ANI) March 4, 2021
మరిన్ని చదవండి ఇక్కడ :