APP vs BJP: టార్గెట్ బీజేపీ టాప్ లీడర్స్.. అవినీతి బండారాన్ని బయటపెడతామంటున్న ఆప్.. షాకింగ్ సవాల్..!

|

Jun 05, 2022 | 9:36 AM

APP vs BJP: ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ అగ్రనేతలపై గురి పెట్టింది. ఏకంగా ఓ రాష్ట్ర సీఎంపైనే అవినీతి ఆరోపణలకు దిగింది. అతిపెద్ద స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తున్నారు

APP vs BJP: టార్గెట్ బీజేపీ టాప్ లీడర్స్.. అవినీతి బండారాన్ని బయటపెడతామంటున్న ఆప్.. షాకింగ్ సవాల్..!
App Vs Bjp
Follow us on

APP vs BJP: ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ అగ్రనేతలపై గురి పెట్టింది. ఏకంగా ఓ రాష్ట్ర సీఎంపైనే అవినీతి ఆరోపణలకు దిగింది. అతిపెద్ద స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అంతేకాదు.. దానికి బీజేపీ నేతల దగ్గర సమాధానం ఉందా? అని సవాల్ కూడా విసురుతున్నారు. అవును, ఓ బడా బీజేపీ నేత అవినీతి బండారాన్ని బయటపెడతానని చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. అయితే ఆయన నోట కాకుండా దాన్ని డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా నోట చెప్పించారు. ఏకంగా అసోం సీఎం హిమంత విశ్వశర్మపైనే అవినీతి ఆరోపణలు గుప్పించారు. అసోం రాష్ట్రంలో ఓ బడా స్కామ్‌ జరిగిందని, ముఖ్యమంత్రే ఈ కుంభకోణం వెనుక ఉన్నాడని ఆరోపించారు మనీష్‌ సిసోడియా.

అసోంలో పీపీఈ కిట్ల కొనుగోలు వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు మనీష్‌ సిసోడియా. అసోం సీఎం హిమంత తన భార్యకు చెందిన సంస్థ ద్వారా అధిక ధరకు పీపీఈ కిట్లు కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు. అయితే అదే రోజు ఇతర సంస్థలకు తక్కువ ధరకు కొనుగోలు చేశారనేది మనీష్‌ సిసోడియా ఆరోపణ. సీఎం భార్య సంస్థ దగ్గర నుంచి ఒక్కో పీపీఈ కిట్‌ 990 రూపాయలకు కొనుగోలు చేస్తే, ఇతర సంస్థల నుంచి ఒక్కో పీపీఈ కిట్‌ను 600 రూపాయలకే కొనుగోలు చేశారని ఆరోపించారు. దీని గురించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు మనీష్‌ సిసోడియా. ఈ కుంభకోణంలో సొంత పార్టీ నేతపై చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా ? అని ప్రశ్నిస్తున్నారు సిసోడియా.

ఇటీవల మనీ లాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ ను అరెస్ట్‌ చేశారు. ఇది అటు కేంద్రానికి, ఇటు ఆప్‌ మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇప్పుడు ఏకంగా అసోం సీఎం అవినీతిని బయటపెట్టిన ఆప్‌ నేతలు, చర్యలు తీసుకునే దమ్ముందా ? అని బీజేపీని ప్రశ్నిస్తున్నారు. దీనికి బీజేపీ ఇచ్చే సమాధానం ఏంటో చూడాలి.