Jammu Kashmir: కశ్మీర్‌లో కొనసాగుతోన్న ఉగ్రవాదుల సెర్చ్‌ ఆపరేషన్‌.. మరో జవాన్‌ వీర మరణం

|

Sep 15, 2023 | 12:10 PM

కశ్మీర్‌ లోని కొకొరెనాగ్‌ అటవీప్రాంతం వరుసగా రెండోరోజు ఎన్‌కౌంటర్‌తో దద్దరిల్లుతోంది. బుధవారం ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయారు. అటవీప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌ లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకొరెనాగ్‌ అటవీప్రాంతంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులతో వరుసగా రెండో రొజు ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీతో సహా మొత్తం నలుగురు చనిపోయారు

Jammu Kashmir: కశ్మీర్‌లో కొనసాగుతోన్న ఉగ్రవాదుల సెర్చ్‌ ఆపరేషన్‌.. మరో జవాన్‌ వీర మరణం
Jammu Kashmir Encounter
Follow us on

కశ్మీర్‌ లోని కొకొరెనాగ్‌ అటవీప్రాంతం వరుసగా రెండోరోజు ఎన్‌కౌంటర్‌తో దద్దరిల్లుతోంది. బుధవారం ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయారు. అటవీప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌ లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకొరెనాగ్‌ అటవీప్రాంతంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులతో వరుసగా రెండో రొజు ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీతో సహా మొత్తం నలుగురు చనిపోయారు. కొకొరెనాగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో మంగళవారం రాత్రి సైన్యం, కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వెంటనే తూటాల వర్షం కురిపించారు. దీంతో 19వ రాష్ట్రీయ రైఫిల్స్‌ కమాండింగ్‌ అధికారి అయిన కల్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్, మేజర్‌ ఆశిశ్‌ ధోనక్, డిప్యూటీ ఎస్పీ హుమయూన్‌ భట్‌ నేలకొరిగారు. మరోవైపు కాల్పుల ఘటనకు నిషేధిత రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ లష్కరే తోయిబానే ఈ రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ సంస్థను వెనక ఉండి నడిపిస్తోంది. ఆగస్టు నాలుగో తేదీన కుల్గామ్‌ జిల్లాలోని హలన్‌ అటవీప్రాంతంలో ముగ్గురు జవాన్ల మరణానికి కారకులైన వారే బుధవారం దాడి చేశారని సైనిక నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాదుల కదలికలపై డ్రోన్లతో నిఘా పెట్టారు. కొకొరెనాగ్‌ ప్రాంతంలో రెండు ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించారు. ఐదుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో నక్కినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతోంది. ఆక్రమిత కశ్మర్‌లో తిష్టవేసిన ఉగ్రవాదుల శిబిరాలపై మళ్లీ సర్జికల్‌ స్ట్రయిక్‌ చేయాలని డిమాండ్‌ బలంగా విన్పిస్తోంది. జమ్ములో డోగ్రా ఫ్రంట్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను తగలబెట్టారు. జమ్ముకశ్మీర్‌లో ఐఎస్‌ఐ కుట్రలు మళ్లీ వేగమయ్యాయి. చొరబాట్లను ప్రోత్సహించేందుకు భారీ కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. అందుకే సరిహద్దుల్లో కూంబింగ్‌ను వేగవంతం చేశారు. మరోవైపు ఈ ఉగ్రవేటలో ఇప్పటివరకు నలుగురు జవాన్లు కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

అమర జవాన్లకు అశ్రు నివాళి 

నలుగురు జవాన్ల వీర మరణం

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..