కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. మూడు రోజుల్లో ముగ్గురు

| Edited By:

Jun 05, 2020 | 5:07 PM

ఓ వైపు దేశ వ్యాప్తంగా అంతా కరోనా మహమ్మారి గురించి భయపడుతుంటే.. గుజరాత్‌లోని కాంగ్రెస్ పార్టీ మాత్రం వారి ఎమ్మెల్యేల గురించి భయపడుతోంది. మరికొద్ది రోజుల్లో అక్కడ రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. మూడు రోజుల్లో ముగ్గురు
Follow us on

ఓ వైపు దేశ వ్యాప్తంగా అంతా కరోనా మహమ్మారి గురించి భయపడుతుంటే.. గుజరాత్‌లోని కాంగ్రెస్ పార్టీ మాత్రం వారి ఎమ్మెల్యేల గురించి భయపడుతోంది. మరికొద్ది రోజుల్లో అక్కడ రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడి రాజకీయాలు జెట్ స్పీడ్‌లో మారుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న అక్కడి కాంగ్రెస్ పార్టీకి గత రెండు రోజుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పి.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇది గడిచి 24 గంటలు కూడా గడవకముందే.. మరో ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బ్రిజేష్ మేర్జా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ రాజేంద్ర త్రివేదికి తన రాజీనామా పత్రాన్ని ఇచ్చిన వెంటనే.. ఆయన రాజీనామాను ఆమోదించారు. మేర్జా ప్రస్తుతం మోర్జీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో మూడు రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. వారి ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.