కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు కొత్తవి కావు : రజత్ కుమార్

తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీ జలాల వినియోగంపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్ లో సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులతో పాటు నిపుణులు హాజరయ్యారు.

కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు కొత్తవి కావు : రజత్ కుమార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 05, 2020 | 4:15 PM

గోదావరి జలాల వినియోగంపై టెలిమెట్రీ ఏర్పాటు కోసం బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసిందని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీ జలాల వినియోగంపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్ లో సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులతో పాటు నిపుణులు హాజరయ్యారు. తెలంగాణ తరుపున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు. గతంలో గోదావరి జలాల్లోంచి 967.14 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు రజత్ కుమార్. ఈ జలాలను వాడుకోవడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. గోదావరి కేటాయింపుల్లో నీటిని ఎక్కడైనా వాడుకోవచ్చని ట్రైబ్యునల్ స్పష్టంగా చెప్పిందన్నారు రజత్ కుమార్. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన జలాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతుందన్నారు. ఇప్పటికే కృష్ణా,గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ లు ఇవ్వాలని బోర్డులు పదేపదే కోరుతున్నాయని.. ప్రభుత్వ అనుమతితో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కొత్తగా తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టలేదన్న రజత్ కుమార్.. కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు నీరు తరలిస్తున్నందున మాకు 45 టీఎంసీలు అదనంగా రావాలని బోర్డును కోరామని రజత్ కుమార్ తెలిపారు. పోతిరెడ్డిపాడుపై రాతపూర్వకంగా కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తామని, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని విషయాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ వాదనలను వినిపిస్తామన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు పూర్తి కానందున, రైతులకు న్యాయం జరగనందునే తెలంగాణ పోరాటం నీళ్లు నిధులు కోసమే సాగిందన్న రజత్ కుమార్ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడి ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు.

Latest Articles
ఏకంగా 9శాతం వడ్డీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే ఈ బ్యాంకులే..
ఏకంగా 9శాతం వడ్డీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే ఈ బ్యాంకులే..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..