Ankita murder case: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్య కేసులో ట్విస్ట్.. పోస్టు మార్టం రిపోర్టులో కీలక విషయాలు..

|

Sep 28, 2022 | 9:44 PM

ఉత్తరాఖండ్ లో సంచలనం సృష్టించిన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈకేసు ఇప్పటికే రాజకీయంగా దుమారం రేపుతుండగా.. బీజేపీ బహిష్కృత నేత కుమారుడు..

Ankita murder case: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్య కేసులో ట్విస్ట్.. పోస్టు మార్టం రిపోర్టులో కీలక విషయాలు..
Ankita Bhandari's Body
Follow us on

ఉత్తరాఖండ్ లో సంచలనం సృష్టించిన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈకేసు ఇప్పటికే రాజకీయంగా దుమారం రేపుతుండగా.. బీజేపీ బహిష్కృత నేత కుమారుడు పుల్కిత్‌ ఆర్య, ఇద్దరు సిబ్బంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో తాజాగా కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే మృతురాలి వేళ్లు, చేతులు, వీపు భాగంలో గాయాల గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినట్లు సమాచారం. ఈ కేసు తీవ్ర వివాదాస్పదం కావడంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా చర్యలు చేపట్టారు. ఈ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారించనున్నట్లు చెప్పారు. అలాగే మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు.

మృతురాలి కుటుంబానికి ప్రకటించిన  పరిహారాన్ని అంకిత భండారీ తల్లిదండ్రులకు అందించాలని అధికారులను సీఏం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అలాగే అంకిత భండారీ కుటుంభానికి త్వరగా న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అంకిత భండారీ హత్య కేసును ఫాస్ట్ ట్రాక్‌ కోర్టుతో విచారణ జరిపించాలని సీఏం పుష్కర్ సింగ్ ధామీ న్యాయస్థానాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.

అంకిత తండ్రితో సీఎం ఫోన్లో కూడా మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మరునాడే పరిహారం కూడా సీఏం ప్రకటించారు.మరోవైపు అంకిత భండారీ హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిందితులకు చెందిన గ్రే యాక్టివా, బ్లాక్‌ పల్సర్‌ బైక్‌లను స్వాధీనం చేసుకుంది. ఈవాహనాలను ఉపయోగించే అంకిత భండారీని కాలువ దగ్గరకు తీసుకెళ్లి ఆ తర్వాత అందులోకి తోసేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తంమీద ఉత్తరఖండ్ లో ఈకేసు ఇప్పుడు పెను సంచలనం రేపుతుంది. మరోవైపు రాజకీయ దుమారనికి కారణమైంది. దేశ వ్యాప్తంగానూ ఈకేసు చర్చనీయాంశం కావడంతో అక్కడి ప్రభుత్వం ఈకేసు విచారణను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలను చేపడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..