AP, Telangana News Live: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు..!
New Vice President Swearing-In: తాత్కాలిక ప్రధాని ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గురువారం (అక్టోబర్ 11) అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, జెన్-జెడ్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నేపాల్ ప్రజలు శాంతించాలని, రాజ్యాంగ పద్ధతిలోనే పరిష్కారం చూపుతామని అధ్యక్షుడు ప్రకటన వెలువరించారు..

ఖాడ్మాండు, సెప్టెంబర్ 12: నేపాల్‌లో కర్ఫ్యూ కొనసాగుతుంది. తాత్కాలిక ప్రధాని ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గురువారం (అక్టోబర్ 11) అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, జెన్-జెడ్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నేపాల్ ప్రజలు శాంతించాలని, రాజ్యాంగ పద్ధతిలోనే పరిష్కారం చూపుతామని అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు. మరోవైపు ఆ దేశంలోని అనిశ్చితి పరిస్థితులను ఆసరా చేసుకుని ఇప్పటి వరకు అక్కడి జైళ్ల నుంచి దాదాపు 15 వేలకుపైగా ఖైదీలు పరారైనట్లు నేపాల్ స్థానిక మీడియా వెల్లడించింది. పారిపోతున్న ఖైదీలను నిలువరించడానికి భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో పలువురు ఖైదీలు మృతి చెందారు. దీంతో సోమవారం నుంచి ఇప్పటి వరకు అక్కడి ఘర్షనల్లో దాదాపు 34 మంది మృతి చెందారు. 1338 మంది గాయపడ్డారు.
సాధ్యమైనంత త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సంయమనం పాటించి శాంతికి సహకరించాలని సైనిక ప్రధాన కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటన వెలువరించారు.
మరిన్ని తాజా అంతర్జాతీయ, జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తా కథనాలు ఇక్కడ తెలుసుకోండి.
LIVE NEWS & UPDATES
-
పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యంః మంత్రి నాదెండ్ల
పేదల ప్రజలకు సరఫరా చేసే రేషన్ బియ్యం లో నాణ్యత ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తుందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం లో ఉన్న రేషన్ మాఫియాను అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 42 లక్షలు గ్యాస్ సీలిండర్లు ను వినియోగదారులు వినియోగించుకున్నారు.4 కోట్ల 42 లక్షలు మందికి రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 80 శాతం రేషన్ కార్డులు పంపిణీ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు తీసుకువచ్చామని, గత ఖరీప్ సీజన్ లో 35 లక్షలు 94 వేలు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించామన్నారు. గత సీజన్ లో రూ. 8,280 కోట్లు విలువ గల ధాన్యం కొన్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
-
నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల ఫ్యామిలీ
నేపాల్ అల్లర్లలో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబసభ్యులు చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కోట్ల సతీమణి కోట్ల సుజాత, కూతురు నివేదిత మరికొందరు డోన్ వాసులతో కలిసి నేపాత్ యాత్రకు వెళ్లారు. అదే సమయంలో నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. దీంతో అక్కడ ఒక హోటల్‌లో ఉండిపోయారు. అయితే కోట్ల సుజాత ఉన్న హోటల్ లో ఆమె లగేజీ, ఫోన్లు దగ్ధమయ్యాయి.
-
-
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలుః సీఎం రేవంత్
గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ చెప్పారు.
-
ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్పుపై రైతుల ఆగ్రహం
ట్రిపులార్‌పై అగ్గి రాజుకుంటోంది. అడ్డగోలు అలైన్‌మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ట్రిపులార్ బాధిత రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముందు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేసిన రైతులు.. ఆ తర్వాత జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎన్‌హెచ్-65పై వాహనాలను అడ్డుకుని రాస్తారోకో చేశారు. అయితే, రైతులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. చివరికి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. వలయాకారంలో కాకుండా చౌటుప్పల్ మండలంలో వంకర టింకర్లుగా పెద్దలకు అనుకూలంగా నిర్మిస్తున్నారన్నది రైతుల ఆరోపణ. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు, బడా బాబుల కోసమే రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును ఇష్టారీతిన వంకర, టింకర తిరుగుతుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
యాకత్‌పురాలో మ్యాన్‌హోల్ తెరిచింది హైడ్రా సిబ్బందే!
యాకత్‌పురాలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. యాకత్‌పురాలో మ్యాన్‌హోల్ తెరిచింది హైడ్రా సిబ్బందేనని తేల్చి చెప్పారు. మూత వేయడం మరిచిపోయింది హైడ్రా సిబ్బందేనన్నారు. ఆరేళ్ల పాప మ్యాన్‌హోల్‌లో పడడానికి కారణం హైడ్రానే అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ చేశామని, తప్పు హైడ్రా సిబ్బందిదేనని తేలిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు.
-
-
దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదుల కుట్ర
దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు చేయడం.. రాజకీయ ప్రముఖులే టార్గెట్‌గా ఆ దాడులు చేయడం ఉగ్రవాదుల లక్ష్యంగా గుర్తించారు. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ హిట్‌లిస్ట్‌లో పలువురు నేతలు ఉన్నట్టు తెలిపారు. ఆత్మాహుతి దాడుల కోసం సూసైడ్ జాకెట్లు , బాంబు కూడా రెడీ చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు డానీష్ నేతృత్వం వహిస్తునట్టు దర్యాప్తులో తేలింది. డానీష్‌కు సీఈవో అని కోడ్‌నేమ్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి సిగ్నల్ యాప్‌లో ఈ గ్యాంగ్‌కు ఆదేశాలు అందుతున్నట్టు గుర్తించారు.
-
నిండు కుండలా జంట జలాశయాలు.. అధికారుల అలర్ట్!
ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు వరద వచ్చి చేరుతోంది. రాజేంద్రనగర్ దగ్గర ORR సర్వీస్ రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో హిమాయత్‌సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో బండ్లగూడ వెళ్లే ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. వికారాబాద్ అడవులు, శివారెడ్డిపేట చెరువు, శంకర్ పల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద నీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు చేరుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ జలాశయానికి కూడా భారీగా వరద నీరు వస్తుంది. 2వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో.. 6గేట్లు ఎత్తి 2వేల 650 క్యూసెక్కులను మూసీ నదిలోకి వదులుతున్నారు.
-
రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యా కళాశాలల నిరవధిక బంద్
సెప్టెంబర్ 15 నుండి రాష్ట్రంలో ఉన్న అన్ని వృత్తి విద్యా కళాశాలల నిరవధిక బంద్ పాటించాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడం లేదని నిర్ణయం తీసుకున్నట్లు సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని ఎన్ని సార్లు మేర పెట్టుకున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమాఖ్య నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల నుండి అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని దుస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని వృత్తి విద్యా కళాశాలల నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
-
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు..!
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని, కొన్ని జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. పలు జిల్లాల్లో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు అధికారులు. తెలంగాణలో ప్రస్తుతం రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు లేవు, పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి, జనగాం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
-
ఏపీలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాతో పాటు యానాంలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం మన్యంలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది
-
3 రోజుల్లో 5 రాష్ట్రాలు.. ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. సెప్టెంబర్ 13 నుండి 15 వరకు మిజోరం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో రూ. 70,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, పలు పనులకు శంకుస్థాపనలు చేస్తారు. మోదీ వివిధ బహిరంగ సభలలో ప్రసంగిస్తారు. అలాగే అస్సాంలో భూపేన్ హజారికా జయంతి వేడుకలకు హాజరవుతారు. బీహార్‌లో మఖానా బోర్డును ప్రారంభిస్తారు.
-
ఇసుకకు వెళ్లి.. ఇరుకున్న ట్రాక్టర్లు..!
మానేరువాగులో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్లు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా వాగు ఉప్పొంగడంతో ట్రాక్టర్లతో సహా వరదల్లో చిక్కుకుని ఆహాకారాలు చేశారు.. వాగులో చిక్కుకున్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు.. కానీ ఎనిమిది ట్రాక్టర్లు వరదల్లో మునిగి పోయాయి. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు వరదల్లో చిక్కుకున్నాయి. ఇసుక రవాణా చేస్తున్నవారు తృటిలో తప్పించుకుని పోలీసులు, స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలో జరిగింది..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు.. ఏం జరిగిందంటే?
విజయవాడ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మొబైల్ ను FSL కి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. నారాయణ స్వామి మొబైల్ లో కీలక ఆధారాలు లభిస్తాయని FSL రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న సిట్. లిక్కర్ స్కాం కేసులో పైలా దిలీప్ బెయిల్ పై ఎసిబి కోర్టుకు పిర్యాదు చేసిన సిట్ అధికారులు. పైలా దిలీప్ కేసును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఎసిబి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సిట్ అధికారులు. బెయిల్ ఆర్డర్స్ ఉల్లంఘించేలా వ్యవహరించవద్దని దిలీప్ కు సూచించిన ఎసిబి కోర్టు. లిక్కర్ స్కాం కేసులో అనుమానాస్పద లావాదేవీలు పైలా దిలీప్ చేస్తున్నట్లు సిట్ గుర్తించింది.
-
Delhi High Court: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు.. నేటి మధ్యాహ్నమే పేలుడంటూ లేఖ
ఢిల్లీ హైకోర్టుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును పోలీసులు హుటాహుటీన ఖాళీ చేయించారు. కోర్టు కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశారు. హైకోర్టు లో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్. కాగా ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు భవనం లోపల బాంబు పేలుడు జరుగుతుందంటూ హైకోర్టుకు బెదిరింపు లేఖ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
-
విజయవాడ డయేరియా కేసుల తాజా అప్డేట్ ఇదే
విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా కేసుల తాజా అప్డేట్ ప్రకారం.. ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసులు 163. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 92 మంది. చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయినవారు 71 మంది.
-
యూనివర్సిటీ చెరువులో తేలిన విద్యార్థి మృతదేహం
జాదవ్‌పూర్ యూనివర్సిటీలో విద్యార్థి అనుమానాస్పద మృతి. క్యాంపస్‌లోని చెరువులో నుంచి విద్యార్థి మృతదేహం వెలికితీశారు. కేసీపీకి తీసుకెళ్లగా వైద్యులు మృతిగా ప్రకటించారు. క్యాంపస్ చెరువులో అపస్మారక స్థితిలో విద్యార్థి మృతదేహం లభ్యం. యూనివర్సిటీలో సాంస్కృతిక కార్యక్రమం జరుగుతున్న సమయంలో విద్యార్ధి చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5-7 నిమిషాల తరువాతే స్నేహితులు గమనించినట్లు వెల్లడి.
-
Transwoman Love Marriage: హిజ్రాను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న యువకుడు
తమిళనాడులోని సేలం జిల్లాలోని తారమంగళం సమీపంలోని ఓమలూర్‌కు చెందిన శరవణ కుమార్(32) అనే వస్త్ర వ్యాపారి.. తన వద్ద పని చేస్తున్న సరోవ(30) అనే హిజ్రాని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం పెద్దల అంగీకారంతో ఈరోడ్ జిల్లాలోని గోపిచెట్టిపాలయంలోని పెరియర్ కల్యాణ మండపంలో జరిగింది. కుమార్, సరోవ ప్రేమ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
Vijayawada Diarrhea Deaths: ‘డయేరియాతో ఎవరూ చనిపోలేదు.. వదంతులు నమ్మకండి’ మంత్రి సత్యకుమార్
విజయవాడలోని న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. మంచినీటి పైపులైన్, అండర్ గ్రౌండ్ నీటి నమూనాలను పరీక్షకు పంపించామన్నారు. మరోవైపు ల్యాబ్ రిపోర్ట్ నెగెటివ్ రావడంతో మంచినీటి సరఫరా కూడా నిలిపివేశామన్నారు. ఇప్పటి వరకు డయేరియాతో ఎవరూ చనిపోలేదని, వదంతులు నమ్మొద్దని మంత్రి సత్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
-
లవర్‌తో సవాల్… మద్యం మత్తులో సముద్రంలోకి దేసుకెళ్లిన కుర్ర’కారు’
స్నేహితులతో బెట్టింగ్ వేసి కారును సముద్రంలోకి తీసుకెళ్లిన యువకుడు. చెన్నైలోని కడలూర్ హార్బర్- పరంగిపేట తీరప్రాంతం వద్ద సముద్రంలోకి ఎవరు కారు నడుపుతారని బెట్టింగ్ వేసుకున్న చెన్నై చెందిన ఐదుగురు యువకులు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని మద్యం మత్తులో ఓ యువకుడు తాను వెళ్లి చూపిస్తానని లవర్ తో సవాల్ చేశాడు. కడలూర్ సమీప సోధికుప్పం వద్ద కారులోని నలుగురిని రోడ్డుపై దించిన యువకుడు.. కారును మ్యాప్ చూస్తూ సముద్రం వెళ్లాడు. కొద్దిసేపటి సముద్రంలో తేలుతున్న కారు అలలు కు కోట్టుకునిపోతున్న సమయంలో కారును గుర్తించిన పోలిసులకు సమాచారం ఇచ్చి మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్న కారును ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చిన పోలీసులు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
-
భారత 15వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్
భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్, వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు.
-
విజయవాడలో 100 దాటిన డయేరియా కేసులు
విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో పెరుగుతున్న డయేరియా కేసులు.. ఇప్పటివరకు 100 దాటిన డయేరియా బాధితుల సంఖ్య. నిన్న రాత్రి మెడికల్ క్యాంప్‌లో 30 మంది చికిత్స కోసం వచ్చారు. మరికొందరు బాధితులు వైద్యానికి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇప్పటికే పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా నిలిపివేసిన అధికారిక యంత్రాంగం.
-
Vijayawada Diarrhea Out Break: విజయవాడలో కొత్తగా మరో 5 డయేరియా కేసుల
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉంది. బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేట వైద్య శిబిరంలో కొత్తగా మరో 5 గురు అడ్మిట్ అయ్యారు. దీంతో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో సచివాలయాల వారీగా బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఎంపీడీవో స్థాయి అధికారి పర్యవేక్షణలో బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులు, వాంతులు, విరేచనాలతో ఎవరైనా బాధపడుతున్నారా? అనే సమాచారాన్ని సేకరించే పనిలో అధికార గణం పని చేస్తుంది.
-
Stray Dogs Attack: స్కూల్‌కి వెళ్తున్న బాలికపై వీధికుక్క వీరంగం
ద్వారకా తిరుమల చెరువు వీధిలో స్కూల్ కి వెళుతున్నా బాలికను వెంబడించిన విధి కుక్కలు. ప్రాణభయంతో పరుగులు బాలిక పెట్టింది. వీధికుక్కలను అదుపుచేయాలని స్థానికులు కోరుతున్నారు.
-
మైలవరం బాలిక హత్య కేసులో సంచలనాలు.. డెడ్ బాడీ మాయం చేసిన తండ్రి
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 14సంవత్సరాల మైనర్ బాలికను సొంత తండ్రి పాశవికంగా హత్య చేసిన ఘటనలో కొనసాగుతున్న విచారణ. 14 ఏళ్ల మైనర్ బాలికను కొట్టి చంపిన తండ్రి బాజీ. యువకుడితో సన్నిహితంగా ఉందనే కారణంతో హత్య చేసి అటవీ ప్రాంతంలో పడేసిన తండ్రి. బాలిక మృత దేహం కోసం రెండు రోజులుగా డ్రోన్ లతో పోలీసులు గాలిస్తున్నారు. బాజీకి రెండు పెళ్లిళ్లు కాగా రెండో భార్య నాగేంద్రమ్మ కుమార్తె గాయత్రినీ బాజీ హత్య చేశాడు. గాయత్రి హత్యకు సహకరించిన మొదటి భార్య నాగమ్మ 5 గురు కుమార్తెలు.
-
‘సీఎం రేవంత్ వేసింది కాంగ్రెస్ కండువా కాదు.. జాతీయ జెండా కండువా’ ఆ 8 మంది MLAల వివరణ
పార్టీ ఫిరాయింపుపై స్పీకర్‌కి వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. తాను పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేమే అంటూ లేఖలో పేర్కొన్న ఎమ్మెల్యేలు. నియోజకవర్గ అభివృద్ధికోసమే సీఎంను కలిశామని స్పష్టం చేశారు. సీఎం వేసింది కాంగ్రెస్ కండువా కాదు.. జాతీయ జెండా కండువా అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వేతన రసీదులు, ఆధారాలు సమర్పించిన ఎమ్మెల్యేలు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వడం సంప్రదాయం అని లేఖలో గాంధీ వివరణ ఇచ్చింది. అనర్హత కేసులో ఒక్కో ఎమ్మెల్యేపై వేర్వేరు విచారణ చేయాలని స్పీకర్ నిర్ణయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మురకు సమాధానం ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. దానం, కడియం మాత్రం గడువు కోరారు.
-
సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ప్రముఖులు
సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరుకానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో 152 ఓట్ల మెజారిటీ తో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై సిపి రాధా కృష్ణన్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
-
Vice President Swearing-In Ceremony: ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం
ఈ రోజు ఉదయం 10 గంటలకు భారత ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్‌లో సీపీ రాధాకృష్ణన్ చేత ప్రమాణస్వీకారం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
-
CP Radhakrishnan: నేడు ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం (సెప్టెంబర్ 12) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 12) ఉదయం 9.30 గంటలకు సీపీ రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
-
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. శిలాతోరణం వరకు ఉన్న భక్తులు క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు. నిన్న 66,312 మంది భక్తులు శ్రీవారికి దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు వచ్చింది.
-
Srisailam Dussehra 2025: ఈ నెల 22 నుంచి శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
నంద్యాల శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల రెండు వరకు జరగనున్న ఉత్సవాలలో ప్రతిరోజు భ్రమరాంబాదేవికి నవదుర్గల అలంకారం, స్వామి అమ్మవార్లకు వాహన సేవలు ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.
-
నేపాల్‌లో పరిస్థితి మళ్లీ మొదటికి
— నేపాల్ కొత్త ప్రధాని ఎవరన్న విషయంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. రెండు వర్గాలుగా చీలిన జెన్ జీ నేతలు నడివీథుల్లో తన్నుకుంటున్నారు. — నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీషింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎవరికి వాళ్లే నేతలుగా ప్రకటించుకోవడంతో నేపాల్‌లో అంతా గందరగోళంగా మారింది. — మరోవైపు ఇండో నేపాల్ సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. నేపాల్ జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు భారత్‌లో ఆశ్రయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. — గత మూడు రోజులుగా నేపాల్‌లో సంక్షోభం కొనసాగుతోంది. పరిస్థితిని అదుపు చేయడానికి ఖాట్మండుతో సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సైన్యం వీధుల్లో పహారా కాస్తోంది.
-
AP Ration Cards 2025: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 30 వరకే ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్‌లో పాత రేషన్ విధానాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త రేషన్ విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తంలో 80 శాతం కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేసింది. అయితే వీటిల్లో తప్పులు రావడంతో వెంటనే దరఖాస్తు చేసుకుని సవరణ చేయించుకోవచ్చని తెలిపింది. ఇందుకు అక్టోబర్ నెల 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు.
-
మానస సరోవరాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న తెలుగు యాత్రికులకు ఊహించని కష్టాలు
మానస సరోవరాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న తెలుగు యాత్రికులకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. నేపాల్ ఉద్రిక్తలతో తిరిగి రాలేక చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు.
— చైనా సరిహద్దుల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు — మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువారు — నేపాల్ అల్లర్లతో చైనా సరిహద్దుల్లో చిక్కుకున్న.. విశాఖ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ యాత్రికులు — నేపాల్‌లో ప్రస్తుతం అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో టూర్ ఆపరేటర్ వారి ప్రయాణాన్ని చైనా సరిహద్దు దగ్గరే నిలిపివేశారు. దీంతో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో వారు చిక్కుకుపోయారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. — తమను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు యాత్రికుల వినతి
-
TTD Srivani VIP Break Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు
తిరుమల తిరుపతిలో వీఐపీలు. శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకున్న పలువరు ప్రముఖులు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రాజస్థాన్ మంత్రి కాంహయ్య లాల్ చౌదరి, కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బాగాల్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ శ్రీవారిని దర్శించుకున్నారు.
-
Kukatpalli Woman Murder Case: కూకట్‌పల్లి రేణు మర్డర్ కేసులో మరో కీలక ఆధారం లభ్యం
కూకట్‌పల్లి రేణు అగర్వాల్ మర్డర్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. నిందితులు పారిపోయిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద బైక్ వదిలేసిన నిందితులు. స్వాన్ లేక్, IDL లేక్, కైల్తాపూర్, హఫీజ్ పేట్ వరకు నిందితులు వెళ్లారు. కూకట్‌ఫల్లి నుండి స్కూటీ మీద 8 కిలోమీటర్లు ప్రయాణించి.. ఆపై హఫీజ్ పేట్ నుండి MMTS ట్రైన్ ఎక్కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే జార్ఖండ్ లోని రాంచీకు పోలీస్ టీమ్స్ చేరుకున్నాయి.
-
AP Tourist at Nepal Border: చైనా సరిహద్దుల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల టూరిస్టులు.. మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తులు
చైనా సరిహద్దుల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు. మానస సరోవర యాత్రకు వెళ్లి చిక్కుకున్న 21 మంది తెలుగు వాళ్ళు. ఈనెల రెండో తేదీన విశాఖ నుంచి ఈ యాత్రకు వెళ్లిన యాత్రికులు తిరుగు ప్రయాణంలో నేపాల్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. నేపాల్ అల్లర్ల కారణంగా చైనా సరిహద్దుల్లో టూర్ ఆపరేటర్ నిలిపివేశారు. బృందంలో విశాఖతోపాటు విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌ఖు చెందిన యాత్రికులు ఉన్నారు. సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని విశాఖ ఎంపీ నారా లోకేష్ కు యాత్రికులు వినతి చేశారు.
-
AP Rain Updates: ఏపీకి భారీ వర్షం అలర్ట్.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
శుక్రవారం పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ యెల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
-
AP Liquor Scam Case: విశాఖ లిక్కర్ కుంభకోణం కేసులో ముగిసిన సిట్ సోదాలు
లిక్కర్ కుంభకోణం కేసులో విశాఖలో ముగిసిన సిట్ సోదాలు. అర్ధరాత్రి వరకు సీట్ అధికారులు సోదాలు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పదిమంది సిబ్బంది సోదాలు నిర్వహించారు. హార్డ్ డిస్క్ లు, కీలక డాక్యు మెంట్లు సీజ్ చేశారు. వాల్తేరు రోడ్ లో గ్రీన్ ఫ్యూయల్స్, వేట్ లైట్ సంస్థల్లో సీట్ విచారణ చేసింది. సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన అన్ని సంస్థల్లో ఈ సోదాలు జరిగాయి.
-
CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. నేడు రాష్ట్రపతి భవన్ లో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు
-
Hyderabad Rains: హైదరాబాద్ గడచిన 24 గంటల్లో కురిసిన వాన ఇదే..
హైదరాబాద్ లోని హయాత్ నగర్ లో.. 11.5 సెంటీమీటర్లు డిఫెన్స్ కాలనీలో.. 10.4 సెంటీమీటర్లు ఉప్పల్‌లో.. 4.7 సెంటీమీటర్లు సరూర్ నగర్‌లో.. 4.3 సెంటీమీటర్లు కూకట్ పల్లిలో.. 3.1 సెంటీమీటర్లు శేరిలింగంపల్లిలో.. 2.5 సెంటీమీటర్లు నాంపల్లిలో.. 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది
-
TG Rain Updates: తెలంగాణలో గడచిన 24 గంటల్లో దంచికొట్టిన వాన
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన దంచి కొడుతుంది. గడచిన 24 గంటల్లో ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతం ఇదే..
- ములుగు జిల్లా మల్లంపల్లి లో.. 21.7 సెంటీమీటర్లు
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి లో.. 21.1 సెంటీమీటర్లు
- హుజురాబాద్ లో.. 19.7 సెంటీమీటర్లు
- మెదక్ జిల్లాలో.. 19.8 సెంటీమీటర్లు
- రాజపల్లిలో.. 15.9 సెంటీమీటర్లు
- రంగారెడ్డి జిల్లా యాచారంలో.. 18 సెంటీమీటర్లు
- సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో.. 17.9 సెంటీమీటర్లు
- కొచ్చెడలో.. 16.9 సెంటీమీటర్లు
- దులమిట్టలో.. 16.4 సెంటీమీటర్లు
- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో.. 17.6 సెంటీమీటర్లు
- మొటకొండూరులో.. 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది
-
శ్రీశైలం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు 9 అవతారాలు
శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు భ్రమరాంబాదేవికి నవదుర్గల అలంకారం, స్వామి అమ్మవార్లకు వాహన సేవలను ఆలయ అధికారులు నిర్వహించన్నారు.
-
Srisailam Dussehra 2025: ఈ నెల 22 నుంచి శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
నంద్యాల శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల రెండు వరకు జరగనున్న ఉత్సవాలలో ప్రతిరోజు భ్రమరాంబాదేవికి నవదుర్గల అలంకారం, స్వామి అమ్మవార్లకు వాహన సేవలు ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.
-
Vijayawada Diarrhea Out Break: విజయవాడలో 115 డయేరియా కేసులు.. కొనసాగుతున్న మెడికల్ క్యాంప్
విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 115 కేసులు నమోదైనాయి. వీరిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 61 మంది. చికిత్స తీసుకొని మరో 54 మంది డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. డయేరియా కారణంగా స్థానికులు కాచి చల్లార్చిన నీరే తాగాలని వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాధితులకు మెడికల్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయి.
Published On - Sep 12,2025 6:57 AM




