Indian Railways: భద్రతలో రాజీ లేదు.. రైల్వేస్ కోసం కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..

| Edited By: Narender Vaitla

Jun 04, 2023 | 8:27 PM

IR Safety Measures: ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి లెక్కల ప్రకారం 288 మంది చనిపోయారు. ఇంకా అనేకమంది తీవ్ర గాయాలతో ఒడిశాలోని స్థానికి హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా విపక్షపార్టీలు..

Indian Railways: భద్రతలో రాజీ లేదు.. రైల్వేస్ కోసం కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..
Indian Railways
Follow us on

IR Safety Measures: ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి లెక్కల ప్రకారం 288 మంది చనిపోయారు. ఇంకా అనేకమంది తీవ్ర గాయాలతో ఒడిశాలోని స్థానికి హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా విపక్షపార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం రైల్వే భద్రతా చర్యలు చేపట్టలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కారణంగా రైల్వే శాఖ తాము తీసుకున్న భద్రతను పెంపొందించడానికి తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. యూపీఏ గవర్నమెంట్ హయాంలో తీసుకున్న భద్రతా చర్యలతో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన పనులను పోలుస్తూ ఆ డేటాను రూపొందించారు.

రైల్వే భద్రతను పెంపొందించడానికి తీసుకున్న చర్యలు:

  • ట్రాక్ పునరుద్ధరణ, నిర్వహణ: గడిచిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ, నిర్వహణ పనులు 5,227 కి.మీల మేర జరగగా.. గత పదేళ్లలో మొత్తం 37,159 కి.మీల దూరం ఆయా పనులు పూర్తయ్యాయి. అంటే ప్రతి ఏటా  సగటున 3,716 కి.మీ జరగ్గా.. 2013-14 సంవత్సరంలో 2,885 కి.మీ దూరం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ, నిర్వహణ పనులయ్యాయి.
  • వెల్డెడ్ పట్టాలు: చాలా వరకు బ్రాడ్ గాజ్ ట్రాక్‌లలో 39 మీటర్ల పొడవు గల చిన్న పట్టాలను కలిపి పొడవైప పట్టాలుగా వెల్డిండ్ చేయబడ్డాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే వాటికి దాదాపు 90 శాతం బ్రాట్ గాజ్ ట్రాక్‌లు ఇలా వెల్డింగ్ చేసిన పట్టాలతో నిర్మించినవే.
  • ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం 17,720 LC గేట్‌లలో 11,079 LC గేట్‌లకు సిగ్నల్‌లతో ఇంటర్‌లాక్ చేయబడింది. అలాగే బ్రాడ్ గాజ్ మార్గంలోని అన్ని మానవరహిత లెవల్ క్రాసింగ్‌లు(UMLCs) తొలగించబడ్డాయి. ఈ ప్రదేశాలలో రోడ్ అండర్ బ్రిడ్జ్ (RUB), రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB) అందించడం ద్వారా మనుషులతో పనిచేసే లెవల్ క్రాసింగ్ గేట్‌ల తొలగింపు కొనసాగుతోంది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 880 మానవ సహిత లెవల్ క్రాసింగ్ గేట్లు మూసివేయబడ్డాయి.
  • LHB డిజైన్ కోచ్‌లతో ICF డిజైన్ కోచ్‌ల భర్తీ: ఇండియన్ రైల్వేస్ ఉత్పత్తి కేంద్రాలు 2018-19 నుంచి LHB కోచ్‌లను మాత్రమే తయారు చేస్తున్నాయి. ఎల్‌హెచ్‌బి కోచ్‌లు ఉన్నతమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా పట్టాలు తప్పవు, ఇంకా ప్రయాణికులకు గాయాలయ్యే అవకాశాలను తగ్గిస్తాయి. CBC సదుపాయంతో ప్రమాదం జరిగినప్పుడు రైల్వే కోచ్‌లు ఒకదానికొకటి పైకి ఎక్కవు.
  • ప్రపంచ స్థాయి సిగ్నలింగ్ సిస్టమ్ అభివృద్ధి:  ఈ రోజు ఇండియన్ రైల్వేస్ 2,325 ఎలక్ట్రానిక్, 3917 రిలే ఆధారిత ఇంటర్‌లాకింగ్, 649 ISB బ్లాక్ స్టేషన్‌లలో ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్‌తో 97% స్టేషన్‌లను కవర్ చేసింది. అంతేకాక 30 వేల కంటే ఎక్కువ కీ. మీ దూరం కవచ్‌తో రక్షించడానికి ఇండియన్ రైల్వేస్ ఆమోదించింది.

కవచ్- ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్

కవచ్: కవచ్ అనేది ఇండియన్ రైల్వేస్ స్వదేశీయంగా తయారు చేసుకున్న ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్(ATP) వ్యవస్థ. అంటే ఇది రైలు ఢీకొనడాన్ని నివారించే వ్యవస్థ. ఇది లోకో పైలట్‌కు ప్రమాదంలో, దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణంలో, రైలు అధిక వేగాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఒకవేళ లోకో పైలట్ అలా చేయడంలో విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్‌ల ద్వారా రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. ఇది రిలే ఆధారిత ఇంటర్‌లాకింగ్‌తో సహా ఇప్పటికే ఉన్న సిగ్నలింగ్ ఇంటర్‌లాకింగ్‌తో ఇంటర్‌ఫేస్ చేయబడుతుంది. ఇంకా ఇది UHFలో రేడియో కమ్యూనికేషన్‌ని ఉపయోగించడం ద్వారా మూవ్‌మెంట్ అథారిటీ రెగ్యూలర్ అప్‌గ్రేడేషన్ ప్రిన్సిపల్‌పై పనిచేస్తుంది. ఇంకా ఇది SIL-4(భద్రతా స్థాయి- 4)కి అనుగుణంగా ఉంటుంది.

  • కవచ్ అమలు: దక్షిణ మధ్య రైల్వేలోని బీదర్ – పర్లి వైజనాథ్ – పర్భాని & మన్మాడ్ – పర్భానీ – నాందేడ్ – సికింద్రాబాద్ – గద్వాల్ – ధోనే- గుంతకల్ సెక్షన్లలో 1200 కిమీ మేర కవచ్ అమలులో ఉంది.
  • ప్రస్తుత స్థితి: దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లలో 1,098 రూట్ కిమీలు, 65 లోకోలకు పైగా కవచ్ నియోగించబడింది.

రాష్ట్రీయ రైల్ సంరక్షా కోష్(RRSK)

రాష్ట్రీయ రైల్ సంరక్షా కోష్ అనేది రూ. 1 లక్ష కోట్లతో ఐదేళ్ల కోసం 2017-18లో కీలకమైన భద్రతను పునఃస్థాపన/పునరుద్ధరణ/అప్‌గ్రేడేషన్ కోసం ప్రవేశపెట్టబడింది. RRSK కోసం 2021-22 ముగింపు నాటికి మొత్తం రూ.74,175.75 కోట్లు ఖర్చు అయింది. ఇందులో రూ. 70,045.79 కోట్లు  బడ్జెట్ ద్వారా కేటాయించినవే. అయితే NITI ఆయోగ్ సిఫార్సుపై స్థూల బడ్జెట్ ద్వారా రూ. 45,000 కోట్ల సహకారంతో 2021-22 తర్వాత మరో ఐదేళ్ల కాలానికి పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో 2022-23 అర్ధిక సంవత్సరానికి రూ. 11,797.42 కోట్లు వెచ్చించగా, 2023-24లో ఇప్పటివరకు 11,000 కోట్లు అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..