Operation Sindoor: ఎఫెక్ట్.. పంజాబ్‌లో హై టెన్షన్‌.. అమృత్‌సర్‌లో ‘బ్లాక్ అవుట్’

మరోవైపు పంజాబ్‌లోని అనేక ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. హెచ్చరికలిచ్చిన వెంటనే ప్రజలు ఇళ్లలోని లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రజలు ఆందోళన చెందకుండా, పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా ఇంట్లోనే ఉండాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రజల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.

Operation Sindoor: ఎఫెక్ట్.. పంజాబ్‌లో హై టెన్షన్‌.. అమృత్‌సర్‌లో ‘బ్లాక్ అవుట్’
Blackout In Amritsar

Updated on: May 08, 2025 | 12:30 PM

ఆపరేషన్ సింధూర్‌.. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కీలక చర్చనీయాంశంగా మారింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ సరిహద్దులలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఇక భారత్ చర్యకు ప్రతి చర్యగా సరిహద్దులలో పాక్‌ సైన్యం కాల్పులు తెగబడుతోంది. దీనికి భారత్ కూడా అంతే దీటుగా సమాధానం చెబుతోంది. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్‌ అమృత్‌సర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భద్రతా కారణాల రీత్యా అక్కడ అధికారులు తరచుగా ‘బ్లాక్ అవుట్’ అమలు చేస్తున్నారు.

ఆపరేషన్‌ సింధూర్‌ దాడితో పిచ్చెక్కిపోయిన పాక్‌ సైన్యం విచ్చలవిడి కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బుధవారం రాత్రి 1:45 గంటల ప్రాంతంలో మూడు వేర్వేరు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకుని మొత్తం జిల్లాలో బ్లాక్‌అవుట్ విధించాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అస్సలు భయపడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీగురు రామ్‌దాస్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌ను పూర్తిగా ఖాళీ చేయించారు. అక్కడ కూడా బ్లాక్‌అవుట్ విధించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

మరోవైపు పంజాబ్‌లోని అనేక ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. హెచ్చరికలిచ్చిన వెంటనే ప్రజలు ఇళ్లలోని లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రజలు ఆందోళన చెందకుండా, పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా ఇంట్లోనే ఉండాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రజల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..