Amit Shah: 3 నెలల్లోనే 4 విజయాలు సాధించారు.. ప్రధాని మోదీపై అమిత్‌ షా ప్రశంసలు

|

Sep 30, 2023 | 7:03 PM

ప్రధాని నరేంద్రమోదీపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంశల వర్షం కురిపించారు. కేవలం 3 నెలల కాల వ్యవధిలోనే పార్లమెంట్‌ నూతన భవనం, చంద్రయాన్‌-3, జీ20 సదస్సు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇలా ఏకంగా నాలుగు విజయాలు నమోదు చేశారని కొనియాడారు. వీటిని సాధించాలంటే వేరేవాళ్లకి ఇంకో 50 సంవత్సరాలు పట్టేదని వ్యాఖ్యానించారు. శనివారం అహ్మదాబాద్‌లో నిర్వహించినటువంటి ఓ సభలో అమిత్ షా మాట్లాడారు.

Amit Shah: 3 నెలల్లోనే 4 విజయాలు సాధించారు.. ప్రధాని మోదీపై అమిత్‌ షా ప్రశంసలు
Home Minister Amit Shah
Follow us on

ప్రధాని నరేంద్రమోదీపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంశల వర్షం కురిపించారు. కేవలం 3 నెలల కాల వ్యవధిలోనే పార్లమెంట్‌ నూతన భవనం, చంద్రయాన్‌-3, జీ20 సదస్సు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇలా ఏకంగా నాలుగు విజయాలు నమోదు చేశారని కొనియాడారు. వీటిని సాధించాలంటే వేరేవాళ్లకి ఇంకో 50 సంవత్సరాలు పట్టేదని వ్యాఖ్యానించారు. శనివారం అహ్మదాబాద్‌లో నిర్వహించినటువంటి ఓ సభలో అమిత్ షా మాట్లాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ‘ఇస్రో’కు ప్రధాని మోదీ పునరుజ్జీవం పోశారని పేర్కొన్నారు. అలాగే శాస్త్రవేత్తల్లో స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. అలాగే భారత్‌ జీ20 సదస్సుకు సారథ్యం వహించి.. ఈ సదస్సు ద్వారా అభివృద్ధి చెందిన, అభివద్ధి చెందుతున్న దేశాల వైపు భారత్‌ ఉంటుందన్న సందేశాన్ని ప్రధాని మోదీ పంపారని అన్నారు.

కొత్త పార్లమెంట్‌ భవనంలో అడుగుపెట్టడమే కాకుండా చట్టసభల్లో మహిళలలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపి చరిత్ర సృష్టించారని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే ఇవన్నీ కూడా కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశారని, ఇంకెవరికైనా ఈ విషయాల్లో ఒక్క పని పూర్తి చేయాలన్నా 50 ఏళ్లు పడుతుందని వివరించారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా మరుగున పడిపోయినటువంటి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రధానమంత్రి మోదీనే తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. అలాగే వినాయక పర్వదినాన కొత్త పార్లమెంట్‌ భవనంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసిన ఘనత ప్రధాని మోదీదే అని వ్యాఖ్యానించారు. అలాగే అంతరిక్ష పరిశోధనలో ఇండియాను అగ్రస్థానంలో నిలిపేలా చేసేందుకు ఇస్రోకు పునరుజ్జీవం పోయడంతో సహా శాస్త్రవేత్తల్లో ప్రధాని మోదీ స్ఫూర్తి నింపారని అన్నారు.

అలాగే చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడం వల్ల ప్రపంచమంతా మనవైపు చూసేలా చేశారని పేర్కొన్నారు. జీ20 సదస్సులను అనేక దేశాలు నిర్వహించాయని.. కానీ కేవలం ఇండియాలో నిర్వహించినటువంటి సమావేశంలో మాత్రమే ప్రపంచ దేశాధినేతలంతా ఏకతాటిపైకి వచ్చారని వ్యాఖ్యానించారు. మరోవైపు అంతర్జాతీయంగా ఉన్నటువంటి భౌగోళిక రాజకీయ సవాళ్ల నడుమ రష్యా, చైనాతో పాటు అమెరికా వంటి దేశాలను సైతం ఒకేతాటిపైకి తెచ్చి ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారని పేర్కొన్నారు. అంతేకాదు జీ20లో ఆఫ్రికా యూనియన్‌ సభ్యత్వానికీ సైతం ప్రధాని మోదీ కృషి చేశారని అన్నారు అమిత్ షా. ఇదిలా ఉండగా.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ సర్కార్‌ను గద్దె దింపాలనే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అవి లోక్‌సభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది.