Punjab Elections 2022: పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఓ వీడియోను అస్త్రంగా మలుచుకుంది. ఈ వీడియోలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సిద్ధూ ‘బడా భాయ్’ (పెద్దన్న)గా సంభోదించారు. గత శనివారం పాక్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌లో సిద్ధూ పర్యటించిన సమయంలో.. స్థానిక అధికారులు సిద్ధూకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సదరు అధికారి పేర్కొనగా.. ఆయన తన పెద్దగా సిద్ధూ స్పందించారు. ఈ వీడియోను బీజేపీ సోషల్ మీడియా విభాగ చీఫ్ అమిత్ మాల్వియా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ ఇష్టపడే సిద్ధూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పెద్దన్న అంటున్నారని.. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ భాజ్వాను ఆలింగనం చేసుకుని ప్రశంసల్లో ముంచెత్తారని గుర్తుచేశారు.
నెహ్రూ కుటుంబీకులు మాజీ ఆర్మీ సైనికాధికారి అమరీంధర్ సింగ్‌ను పక్కనబెట్టి పాక్‌ను ప్రేమించే సిద్ధూను నెత్తికెత్తుకోవడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా? అంటూ అమిత్ మాల్వియా వ్యాఖ్యానించారు.
Rahul Gandhi’s favourite Navjot Singh Sidhu calls Pakistan Prime Minister Imran Khan his “bada bhai”. Last time he had hugged Gen Bajwa, Pakistan Army’s Chief, heaped praises.
Is it any surprise that the Gandhi siblings chose a Pakistan loving Sidhu over veteran Amarinder Singh? pic.twitter.com/zTLHEZT3bC
— Amit Malviya (@amitmalviya) November 20, 2021
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్వయంగా హాజరుకావడం తెలిసిందే. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
Also Read..
Odd News: పాము కాటుకు నాటు కోడి వైద్యం.. ఒక్క ప్రాణం పోతే ఒట్టు..!
AP Floods: రెస్క్యూ చేస్తుండగా ప్రమాదం.. తండ్రీకొడుకులను కాపాడి చనిపోయిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్..