Transgenders Join NCC : ఎన్‌సీసీ లోకి ట్రాన్స్‌జెండర్స్‌.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. కేంద్రానికి ఆదేశాలు జారీ..

|

Mar 15, 2021 | 5:46 PM

Transgenders Join NCC : కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రాన్స్ జెండర్స్‌ను కూడా NCC (నేషనల్ కేడెట్ కార్ప్స్) లోకి తీసుకోవాలని

Transgenders Join NCC : ఎన్‌సీసీ లోకి ట్రాన్స్‌జెండర్స్‌.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. కేంద్రానికి ఆదేశాలు జారీ..
Transgenders Join Ncc
Follow us on

Transgenders Join NCC : కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రాన్స్ జెండర్స్‌ను కూడా NCC (నేషనల్ కేడెట్ కార్ప్స్) లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తిరువనంతపురంలో ఓ ట్రాన్స్ జెండర్ విద్యార్థి వేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

23 ఏళ్ల ట్రాన్స్ జెండర్ హైనా హనీఫా తిరువనంతపురం యూనివర్సిటీకి చెందిన కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే కాలేజీ సిబ్బంది త్వరలో ఎన్‌సీసీ క్లాసులు ప్రారంభం కానున్నాయని, ఇంట్రెస్ట్ ఉన్నపేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. అయితే అందులో చేరేందుకు ట్రాన్స్ జెండర్ హైనా హనీఫా ప్రయత్నించింది. కానీ హనీఫాను ఎన్ సీసీలో జాయిన్ చేయించుకునేందుకు కాలేజీ యాజమాన్యం ఒప్పుకోలేదు. రూల్ ప్రకారం ట్రాన్స్ జెండర్లను ఎన్ సీసీలో తీసులేమని చెప్పడంతో హనీఫా కేరళ హైకోర్ట్ ను ఆశ్రయించింది.

పాఠశాలలో ఉన్నప్పుడు తాను అమ్మాయిగా ఎన్ సీసీలో జాయిన్ అయినట్లు తెలిపింది. 2019లో అబ్బాయిగా తనపేరు నమోదు చేసినట్లు పిటిషన్ లో పేర్కొంది. తర్వాత యూనివర్సిటీలో తన పేరును ట్రాన్స్ జెండర్ కేటగిరీలో గా తన పేరును నమోదు చేయించినట్లు హనీఫా తెలిపింది. ఇప్పుడు ఎన్ సీసీలో జాయిన్ అయ్యేందుకు ట్రాన్స్ జెండర్ గా తన పేరు నమోదు చేయించుకుంటే అడ్మిషన్ ఇవ్వడంలేదని, తనకు న్యాయం చేయాలని కోర్టు వారికి విన్నవించుకుంది.

విచారణ చేపట్టిన కేరళ హైకోర్ట్.. హనీఫాకు ఫిజికల్ టెస్ట్ చేసిన తర్వాత ఎన్ సీసీలోకి తీసుకోవాలని, ఆ ప్రాసెస్ అంతా కోర్ట్ పర్యవేక్షణలో జరిగేలా చూసుకుంటామని న్యాయమూర్తి అను శివరామన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు సెక్షన్- 6 ని పరిగణలోకి తీసుకొని నేషనల్ కేడెట్ కార్ప్స్ యాక్ట్ (1948) ప్రకారం ట్రాన్స్ జెండర్స్ కు సైతం ఎన్‌సీసీలో అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Pushpaka Vimanam : విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘పుష్పక విమానం’’ ఫస్ట్ సాంగ్

MLC Elections : 76.41, తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ శాతాన్ని ప్రకటించిన అధికారులు

ఒడిశా రైతు క్రియేటివిటీ.. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉండలేక కారును తయారు చేశాడు.. ఆ కారు స్పెషాలిటీ ఏంటో తెలుసా..