IAF హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. వ్యవసాయ పొలాల్లో అత్యవసర ల్యాండింగ్..

సాంకేతిక కారణాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన హెలికాప్టర్ రాజస్థాన్ లోని హనుమాన్ ఘర్ జిల్లా సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఫైలట్ అత్యవసరం హెలికాప్టర్ ని..

IAF హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. వ్యవసాయ పొలాల్లో అత్యవసర ల్యాండింగ్..
Iaf Helicopter

Edited By:

Updated on: Aug 23, 2022 | 3:50 PM

Rajasthan: సాంకేతిక కారణాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్సు(IAF)కు చెందిన హెలికాప్టర్ రాజస్థాన్ లోని హనుమాన్ ఘర్ జిల్లా సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఫైలట్ అత్యవసరంగా హెలికాప్టర్ ని వ్యవసాయ క్షేత్రంలో దించారని, హెలికాప్టర్ లో సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సంగారియా పోలీస్ స్టేషన్ కు చెందిన హౌస్ ఆఫీసర్ హనుమానారామ్ విష్ణోయ్ ఈఘటనపై మాట్లాడుతూ.. హెలికాప్టర్ లోని వార్నింగ్ లైట్ బ్లింక్ అవ్వడాన్ని గమనించిన ఫైలట్ అత్యవసరంగా హెలికాప్టర్ ను కిందికి దించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఉదయం 10 గంటల సమయంలో హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయిందని.. భద్రతా అంశాలను ధృవీకరించుకున్న తర్వాత పొలాల్లో నుంచి బయలుదేరిన హెలికాఫ్టర్ ప్రయాగ్ రాజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..