AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రియుడిపై మూకుమ్మడి దాడికి దిగిన గ్రామస్తులు.. అది తట్టుకోలేక ప్రియురాలు ఏం చేసిందంటే..

Viral Video: ప్రేమకు అంగీకారం పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమికులు ముందుగా తమ ఇళ్లలో ఒప్పించాలి..

Viral Video: ప్రియుడిపై మూకుమ్మడి దాడికి దిగిన గ్రామస్తులు.. అది తట్టుకోలేక ప్రియురాలు ఏం చేసిందంటే..
Lovers
Shiva Prajapati
|

Updated on: Aug 23, 2022 | 2:24 PM

Share

Viral Video: ప్రేమకు అంగీకారం పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమికులు ముందుగా తమ ఇళ్లలో ఒప్పించాలి.. ఆ తరువాత బంధువులకు నచ్చజెప్పాలి.. మరికొన్ని చోట్ల కులానికి సంబంధించిన బంధువులను ఒప్పించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా బహిష్కరణలే ఉంటాయి మరి. ఇంకా తేడా కొడితే.. ప్రాణాలే గాల్లో కలిసే ప్రమాదం ఉంది. తాజాగా ఓ ప్రేమ జంటపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ప్రియులిద్దరినీ విడదీసేందుకు గ్రామస్తులు విశ్వప్రయత్నం చేశారు. ప్రియుడిపై దాడి చేస్తూ.. ప్రేయసిని వేరు చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఆ ప్రేమికులు మాత్రం ఎంతకీ తగ్గలేదు. తాము విడిపోయేది లేదంటూ.. ఒకరినొకరు గట్టి హత్తుకుని, ఆ గుంపు నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడయో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

బీహార్‌లోని కతిహార్‌ ఫాల్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వీడియోలో పేర్కొన్న క్యాప్షన్ ఆధారంగా తెలుస్తోంది. ఈ వీడియోలో ప్రేమికుడిని గ్రామస్తులు విచక్షణా రహితంగా కొడుతున్నారు. అయితే, అతన్ని కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన ఆ ప్రేయసి.. తన ప్రియుడి ఒంటిపై దెబ్బలు పడకుండా ఉండేందుకు అతన్ని గట్టిగా హత్తుకుంది. అయినప్పటికీ తగ్గని జనాలు.. వారిద్దరిపై దాడి చేస్తూ విడదీసేందుకు ప్రయత్నించారు. ఇంతలో దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. జనం నుంచి వారిద్దరినీ రక్షించారు. అయితే, ఇందులో మరో బిగ్ ట్విస్ట్ ఉంది.

బిగ్ ట్విస్ట్.. ఈ ఘటనుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బబ్బన్ చౌదరికి రెండేళ్ల క్రితం చోనియా బస్టాల్‌లోని ఆర్తి కుమారితో వివాహం జరిగింది. వారి వైవాహిక జీవితం కొంతకాలం సజావుగానే సాగింది. ఆరు నెలల క్రితం అకస్మాత్తుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో ఆర్తి.. తన భర్తను వదిలేసింది. అయితే, ఆర్తి చోనియా బస్తోల్ గ్రామానికే చెందిన మరో యువకుడిని ప్రేమించింది. భర్త నుంచి విడిపోయిన తరువాత అతనితో కలిసి తిరుగుతోంది. తాజాగా వీరిద్దరూ కలిసి ఉండగా.. అత్తమామలు, గ్రామ ప్రజలు పట్టుకున్నారు. వారిని తీవ్రంగా కొట్టారు.

ఆర్తి భర్తకు రెండో పెళ్లి.. అయితే, ఆర్తి మొదటి భర్త ఆరు నెలల క్రితమే మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆర్తితో అన్ని సంబంధాలు తెంచుకున్నాడని, అతను కూడా మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. గ్రామస్తులు, బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..