AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook: ఫేస్‌బుక్‌ ఫేక్‌న్యూస్‌గా మారింది.. బీజేపీకి అమ్ముడు పోయింది.. కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని కాంగ్రెస్‌ మండిపడుతోంది. బీజేపీ -ఫేస్‌బుక్‌ డీల్‌పై జేపీసీతో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

Facebook: ఫేస్‌బుక్‌ ఫేక్‌న్యూస్‌గా మారింది.. బీజేపీకి అమ్ముడు పోయింది.. కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు
Fb
Venkata Narayana
|

Updated on: Oct 26, 2021 | 8:52 PM

Share

FB – Congress party: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని కాంగ్రెస్‌ మండిపడుతోంది. బీజేపీ -ఫేస్‌బుక్‌ డీల్‌పై జేపీసీతో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేసే విధంగా ఫేస్‌బుక్‌ విధానం ఉందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఫేస్‌బుక్‌ విధానాలు అమెరికాలో ఓ విధంగా.. భారత్‌లో ఇంకో విధంగా ఉన్నాయని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతల విద్వేషపూరితమైన వ్యాఖ్యలకు ఫేస్‌బుక్‌లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించింది.

భారత్‌లో ఫేస్‌బుక్‌కు లక్షలాదిమంది ఖాతాదారులున్నారని, ఫేక్‌ న్యూస్‌తో వాళ్లందరిని తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా కాంగ్రెస్‌ మండిపడింది. భారత ప్రజాస్వామ్యాన్ని విదేశీ కంపెనీలు ప్రభావితం చేయడం తగదన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌. ఫేస్‌బుక్‌ ఇండియా అంతర్గత రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. విద్వేషపూరితమైన స్పీచ్‌లను ఫిల్టర్‌ చేయడం లేదని అంతర్గత నివేదికలో ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఎవరు ఏది మాట్లాడినా యధాతధంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ అవుతున్నట్టు గుర్తించారు. ఫేస్‌బుక్‌ ఫేక్‌బుక్‌ అని ఈవిషయం రుజువుచేస్తోందని కాంగ్రెస్‌ మండిపడింది.

ఫేస్‌బుక్‌ బీజేపీ రహస్య ఏజెండాను అమలు చేస్తోందని విమర్శించింది. దీనికి సంబంధించి ప్రజా వేగు ఫ్రాన్సిన్‌ హౌగేన్‌ విడుదల చేసిన డాక్యుమెంట్లు నిదర్శమని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. హిందీ , బెంగాలీలో విపరీతమైన విద్వేషపూరితమైన పోస్ట్‌లు వస్తున్నాయని , కాని వాటిని ఫేస్‌బుక్‌ ఆపడం లేదని తన నివేదికలో పేర్కొన్నారు ఫ్రాన్సిన్‌ హౌగేన్‌ . బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేసే విధంగా ఫేస్‌బుక్‌ పనిచేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్‌బుక్‌ – బీజేపీ మధ్య ఉన్న డీల్‌పై జాయింట్‌ పార్టమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. వాట్సాప్‌ , ట్విటర్‌పై ఎన్నో చర్యలు తీసుకున్న కేంద్రం ఫేస్‌బుక్‌పై మాత్రం నోరుమెదపడం లేదని విమర్శించింది.

Read also: Palnadu Politcs: ఎమ్మెల్యే కాసు, యరపతినేని మధ్య రాజకీయ వైరం కొత్త టర్న్‌.. పౌరుషాల గడ్డ పల్నాడులో వైసీపీ నేతల ‘గాంధీ’గిరి