Ahmedabad Plane Crash: నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌.. ఏటీసీతో ఎయిరిండియా పైలట్‌ చివరి సంభాషణ ఇదే..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విమానంలోని 241 మంది మరణించారు.. హాస్టల్ భనవంపై విమానం పడటంతో 33 మంది మెడికోలు కూడా మరణించారు. అయితే.. పైలట్ చివరి ఆడియోలో ఏముంది..? ఐదు సెకన్ల మెసేజ్‌లో ఏటీసీకి ఎలాంటి సమాచారం ఇచ్చారు..? మేడే కాల్ ఇచ్చిన వెంటనే విమానం కూలిపోయిందా..?

Ahmedabad Plane Crash: నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌.. ఏటీసీతో ఎయిరిండియా పైలట్‌ చివరి సంభాషణ ఇదే..
Ahmedabad Plane Crash

Updated on: Jun 15, 2025 | 6:54 AM

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విమానంలోని 241 మంది మరణించారు.. 242 మంది ప్రయాణికుల్లో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే.. బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్ భనవంపై విమానం పడటంతో 33 మంది మెడికోలు కూడా మరణించారు. మొత్తంగా ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కి చేరింది. అయితే.. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు అసలేం జరిగింది.. ఏటీసీకి పైలట్‌ ఏం చెప్పాడు.. బ్లాక్‌బాక్స్‌లో ఏం రికార్డు అయింది. విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్‌గా పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. ఐదు సెకన్ల మెసేజ్‌ను ఎయిర్‌ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి అందించారు. మేడే.. మేడే.. మేడే.. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని మెసేజ్ ఇచ్చారు. మేడే కాల్ ఇచ్చిన వెంటనే ఎయిరిండియా విమానం కూలిపోయిందని ఏవియేషన్ అధికారులు తెలిపారు. సుమిత్ సబర్వాల్ కాల్ చేసినట్లు ఏటీసీలో రికార్డ్ అయిందని స్పష్టం చేశారు.

మరోవైపు ప్రమాదాలు జరిగినప్పుడు విమానంలోని బ్లాక్ బాక్స్‌లో రికార్డ్ అయిన అంశాలు కీలకంగా మారుతాయి. బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తే అసలు ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందనేది తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి కమర్షియల్ ప్లైట్‌లో రెండు బ్లాక్‌ బాక్సులుంటాయ్. ఒకటి విమానానికి ముందు భాగంలో.. మరొకటి వెనుక భాగంలో ఉంటుంది. ఇక మొదటిది.. ప్లైట్ డేటా , విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, కాక్‌పిట్ వాయిస్, పైలట్ల సంభాషణలు, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది.

ఇక రెండో బ్లాక్ బాక్స్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో పైలట్ల కమ్యూనికేషన్, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. దీంతో ఈ రెండు బ్లాక్‌బాక్సుల ద్వారా డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏమి జరిగిందో.. పైలట్లు ఏమి మాట్లాడారో.. ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..