AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India plane crash: మృత్యుంజయ రహస్యం – విమాన ప్రమాదంలో సంచలన దృశ్యం

అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ విమాన ప్రమాదంలో ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. 242 మంది ప్రయాణికులలో 11ఏ సీటులో కూర్చున్న రమేష్ విశ్వాస్ మాత్రమే చిన్న గాయాలతో బయటపడటం మిస్టరీగా మారింది. భయంకరమైన విస్ఫోటనంలో అతను ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? విమానం కూలే ముందు అతని స్థానంలో ఎలాంటి మార్పు జరిగింది? బ్లాక్ బాక్స్ డేటా, CCTV ఫుటేజీ ఆధారంగా గుజరాత్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Air India plane crash: మృత్యుంజయ రహస్యం - విమాన ప్రమాదంలో సంచలన దృశ్యం
Plane Crash
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2025 | 3:40 PM

Share

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అంతు చిక్కని ప్రశ్నలు. ఇప్పటివరకు బోయింగ్ ఎలా కూలిందో కారణాలు తెలియరాలేదు. కూలే ముందు పైలట్ మేడే కాల్ ఇచ్చిన వాయిస్ రికార్డ్ మాత్రమే ఉంది. ఇంకా బ్లాక్ బాక్స్ డేటా ను విశ్లేషించాల్సి ఉంది. ఆ డేటా వచ్చాకే విమాన ప్రమాదానికి అసలు కారణాలు తెలుస్తాయి..అయితే ఇక్కడ అధికారులకు అంతుచిక్కని ప్రశ్నలు అనేకం తెరపైకి వస్తున్నాయి. 242 ప్రయాణికుల్లో బతికింది ఒక్కడే. అంత భారీ విస్పోటనం జరిగాక…ఎవరూ బతికే చాన్స్‌లేదని అందరూ భావించారు. కానీ 11ఏ సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇది ఆనందించాల్సిన విషయమే. కానీ అంత విస్ఫోటనంలో అతనొక్కడు ఎలా బయటపడ్డాడన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న…ఈప్రశ్నకు సమాధానమే ఈ వీడియోనా…?

చూశారుగా..విమానం కూలేముందు..జస్ట్ మైక్రోసెకన్స్‌ గ్యాప్‌లో ఓ ముక్క ఎగిరినట్టుగా కనిపిస్తోంది…గమనించారా..? ఆముక్క ఏంటన్నదానిపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఎగిరిన ఆ ముక్కలో విశ్వాస్ కుమార్ ఉన్నారా..అన్న డిస్కషన్ మొదలైంది. అయినా అంతెత్తునుంచి పడిన అతడు చిన్న చిన్న గాయాలతోనే ఎలా బయటపడ్డాడన్నదీ మిస్టరీగా మారింది..

విశ్వాస్ కుమార్ చెబుతున్నదాన్ని బట్టి..చూస్తే…అతడు ప్రమాదస్థలంలోనే ఉన్నాడని అర్ధమవుతోంది. తన చుట్టూ మృతదేహాలు ఉన్నట్లు విశ్వాస్ చెబుతున్నాడు. అంటే విమానకూలిన ప్రాంతంలోనే విశ్వాస్ పడిపోయాడు. అతను కూర్చున్న సీటుతో సహా పడిపోయాడా…? అదే ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యమా..అన్నది తేలాల్సి ఉంది.

విమాన ప్రమాదం నుంచి రమేష్‌ విశ్వాస్‌ ఎలా బతికిబయటపడ్డాడన్నదానిపై గుజరాత్ పోలీసులు విచారిస్తున్నారు. ఎలా బయటపడ్డానో తనకే తెలియదని రమేష్‌ విశ్వాస్ చెబుతున్నాడు. విమానం నుంచి రమేష్‌ ఏ ప్రాంతంలో పడ్డారనే అంశంపైనా పోలీసుల ఫోకస్ పెట్టారు. నడుచుకుంటూ రోడ్డువరకు ఎలా రాగలిగారు? విమానం కూలిన హాస్టల్‌ భవనం చుట్టూ ఉన్న ఇసుకతిన్నెలపై పడ్డాడా? అన్న కోణంలోనూ ఇన్విస్టిగేషన్ జరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని CCTV ఫుటేజీని అధ్యయనం చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్